Sunday, December 15, 2024

న్యూ ఆర్లియన్స్‌లో రెండు కాల్పుల ఘటనలు

- Advertisement -
- Advertisement -

ఇద్దరు మృతి, 9 మందికి గాయాలు
న్యూ ఆర్లియన్స్ (యుఎస్) : యుఎస్‌లోని న్యూ ఆర్లియన్స్‌లో ఒక పరేడ్ మార్గంపై ఆదివారం జరిగిన రెండు వేర్వేరు కాల్పుల సంఘటనల్లో ఇద్దరు మృతి చెందగా మరి తొమ్మిది మంది గాయపడ్డారని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. సెయింట్ రోచ్ ప్రాంతంలో ఒక అవెన్యూ వద్ద ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల తరువాత తుపాకుల కాల్పుల వార్తలకు స్పందించిన అధికారులు కాల్పుల గాయాలతో ఎనిమిది మంది బాధితులను చూసినట్లు న్యూ ఆర్లియన్స్ పోలీస్ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆ ఎనిమిది మందినీ ఆసుపత్రిలో చేర్పించారు.

దాదాపు 45 నిమిషాల తరువాత అదే అవెన్యూలో ఉత్తరంగా దాదాపు ఒక కిమీ దూరంలో తుపాకీ కాల్పుల గురించి పోలీసులకు మరొక సమాచారం అందింది. ఆ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడ మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చనిపోయినట్లు ఆ ప్రకటన తెలిపింది. మూడవ బాధితుని ఒక ప్రైవేట్ కారులో ఆసుపత్రికి తరలించినట్లు, అతని పరిస్థితి స్థిరంగా ఉందని పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News