Friday, April 26, 2024

శీతాకాల సమావేశాల నాటికి కొత్త పార్లమెంట్ భవనం సిద్ధం : స్పీకర్ ఓం బిర్లా

- Advertisement -
- Advertisement -

New Parliament building ready for winter session: Om Birla

న్యూఢిల్లీ : ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సరికొత్త భవనం లోనే జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్పీకర్ ఓం బిర్లా ఆదివారం వెల్లడించారు. కొత్తభవనంలో శీతాకాల సమావేశాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ కొత్త భవనం ఆత్మనిర్భర్ భారత్‌ను తెలియజేస్తుంది. పాత భవనంతో పోలిస్తే ఈ కొత్త భవనం సాంకేతికంగా, భద్రతా పరంగా అత్యాధునికంగా ఉంటుంది. పాతభవనం కూడా దీనిలో ఒక భాగంగా ఉంటుంది. అని స్పీకర్ పేర్కొన్నారు. పార్లమెంట్ పనితీరు బాగా మెరుగుపడిందని, ప్రతి ఒక్కరూ సహకరించడంతో అర్ధరాత్రి వరకు సభ నడుస్తోందని ఓం బిర్లా పేర్కొన్నారు. ఇందుకోసం తరచూ ఆయా పార్టీల నేతలతో తాను చర్చిస్తున్నట్టు చెప్పారు. వారి సహకారంతో సభ పనితీరు, చర్చల సమయం గణనీయంగా మెరుగుపడ్డాయని వెల్లడించారు. ఇటీవల పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ అక్టోబర్ నాటికి కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తవుతుందన్నారు. కొత్త పార్లమెంట్ భవనానికి మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ పేరు పెట్టి భారత మత సామరస్యంపై సందేశం పంపాలని ప్రధాని నరేంద్రమోడీని గత ఏడాది ఢిల్లీ కాంగ్రెస్ కమిటీ అభ్యర్థించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News