Tuesday, October 22, 2024

ఉగాండ @ 40 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

కివీస్ ఘన విజయం

ట్రినిడాడ్: టి20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్‌సి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉగాండ 18.4 ఓవర్లలో 40 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో ప్రత్యర్థి టీమ్‌ను తక్కువ స్కోరుకే కుప్పకూల్చారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 5.2 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా న్యూజిలాండ్ సూపర్8కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఓపెనర్ ఫిన్ (9) పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ డెవోన్ కాన్వే 22 (నాటౌట్) జట్టును గెలిపించాడు.
ఆరంభం నుంచే..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఉగాండకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు రొనక్ పటేల్ (2), సిమన్ సెసాజి (0)లు జట్టుకు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. తర్వాత వచ్చిన రాబిన్సన్ ఒబుయా (0), అల్పెష్ రాంజాని (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. మిగతా బ్యాటర్లు కూడా ఇలా వచ్చి అలా పెవిలియన్ బాట పట్టారు. దీంతో ఉగాండ్ ఇన్నింగ్స్ 40 పరుగులకే పరిమితమైంది. కె.వైస్వా (11) ఒక్కడే రెండంకెల స్కోరును అందుకున్నాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథి 4 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్, సాంట్నర్, రచిన్ రవీంద్రలు రెండేసి వికెట్లను పడగొట్టి ఉగాండను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో తమవంతు పాత్ర పోషించారు. ఈ వరల్డ్‌కప్‌లో కివీస్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. కాగా, గ్రూప్‌సి నుంచి ఇప్పటికే ఆతిథ్య వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ జట్లు సూపర్8కు అర్హత సాధించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News