Saturday, April 20, 2024

జగన్ సర్కార్‌కు ఎపి హైకోర్టులో ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

AP-High-Court

అమరావతి: జగన్ సర్కారుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తొలగింపుపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ విషయంపై కొన్ని రోజులుగా విచారణ జరిపిన హైకోర్టు.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని సూచిస్తూ… ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ కొట్టివేసినట్లు హైకోర్టు తీర్పునిచ్చింది. కొత్త ఎలక్షన్ కమిషనర్ నియామకం చెల్లదని తీర్పు ఇచ్చింది.

ఇసిగా నిమ్మగడ్డను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో తిరిగి విధుల్లో చేరనున్నారు నిమ్మగడ్డ రమేష్. హైకోర్టు తీర్పుపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందిస్తూ… ”హైకోర్టు సూచనలతో విధుల్లో చేరుతా. నా విధులను నిష్పక్షపాతంగా నిర్వహించా. అందరి సంప్రదింపులతోనే స్థానిక ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తాం. వ్యక్తులు శాశ్వతం కాదు…. రాజ్యంగా వ్యవస్థలే శాశ్వతం. రాజ్యాంగ పరిరక్షణ చేస్తానని ప్రమాణం చేసినవారు ఆ బాధ్యతల్ని నెరవేర్చాలి” అని నిమ్మగడ్డ రమేష్ పేర్కొన్నారు.

Nimmagadda Ramesh Continue As state EC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News