Home జాతీయ వార్తలు రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు….

రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు….

State wise corona cases in india

ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటలో భారత్‌లో 7466 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 1.65 లక్షలకు చేరుకోగా 4713 మంది మృతి చెందారు. ఇండియాలో కరోనా వైరస్ నుంచి దాదాపుగా 71 వేల మంది కోలుకోగా 90 వేల మంది వివిధ ఆస్పత్రులో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ వీర విజృంభణ చేస్తోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ 59 వేల మందికి వ్యాపించగా దాదాపుగా రెండు వేల మంది మృత్యువాతపడ్డారు. ముంబయిలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒక్క ముంబయిలోనే కరోనా కేసుల సంఖ్య 35 వేలు ఉండగా 1135 మంది చనిపోయారు. ఒక్క మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య లక్ష ఉండొచ్చని స్థానిక మీడియా అభిప్రాయపడింది. ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్యలో భారత్ తొమ్మిదోవ స్థానంలో ఉంది. ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య 59 లక్షలకు చేరుకోగా 3.62 లక్షల మంది చనిపోయారు. కరోనా నుంచి 25.81 లక్షల మంది కోలుకోగా 29.64 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ప్రపంచంలో ఇంకా 54 వేల కరోనా రోగుల పరిస్థితి విషమంగా ఉంది.

రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు:

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు బాధితుల సంఖ్య చికిత్స పొందుతున్నవారు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
59,546 38,948 18,616 1,982
తమిళనాడు 19,372 8,676 10,548 148
ఢిల్లీ 16,281 8,470 7,495 316
గుజరాత్ 15,572 6,609 8,003 960
రాజస్థాన్ 8,158 3,121 4,855 182
మధ్య ప్రదేశ్ 7,453 3,082 4,050 321
ఉత్తర ప్రదేశ్ 7,170 2,758 4,215 197
రాష్ట్రాలు గుర్తించిన వారు 4,673 4,673 0 0
పశ్చిమ బెంగాల్ 4,536 2,573 1,668 295
ఆంధ్రప్రదేశ్ 3,245 1,053 2,133 59
బిహార్ 3,185 2,120 1,050 15
కర్నాటక 2,533 1,666 818 47
తెలంగాణ
2,256 844 1,345 67
పంజాబ్
2,158 172 1,946 40
జమ్ము కశ్మీర్
2,036 1,150 859 27
ఒడిశా 1,660 766 887 7
హర్యానా 1,504 604 881 19
కేరళ 1,089 526 555 8
అస్సాం 881 770 104 4
ఉత్తరాఖండ్ 500 414 79 4
ఝార్ఖండ్ 470 275 191 4
ఛత్తీస్ గఢ్ 398 315 83 0
ఛండీగఢ్ 289 96 189 4
హిమాచల్ ప్రదేశ్ 281 199 73 6
త్రిపుర 244 77 167 0
లడఖ్
74 31 43 0
గోవా 69 31 38 0
మణిపూర్ 55 51 4 0
పుదుచ్చేరీ 53 36 17 0
అండమాన్ నికోబార్ దీవులు 33 0 33 0
మేఘాలయ
21 8 12 1
నాగాలాండ్ 18 18 0 0
అరుణాచల్ ప్రదేశ్
3 2 1 0
దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ
2 1 1 0
మిజోరం 1 0 1 0
సిక్కిం 1 1 0 0
మొత్తం
1,65,820 90,136 70,960 4,713