Saturday, May 4, 2024

ర్యాగింగ్ రహిత ఆసుపత్రిగా ‘నిమ్స్’

- Advertisement -
- Advertisement -

వేలాది మంది వైద్య విద్యార్ధులకు భరోసా: డైరెక్టర్ బీరప్ప

హైదరాబాద్ : నిజాం వైద్య విజ్ఞాన సంస్థలో నేటి వరకు ఎలాంటి ర్యాగింగ్ కి తావు లేదని ప్రతి విద్యార్థి సేవాభావంతో, అంకిత భావంతో విద్యను అభ్యసిస్తున్నారని,  నిమ్స్ రాగింగ్ ఫ్రీ ఆసుపత్రి అని డైరెక్టర్ బీరప్ప తెలిపారు. దేశంలోనే ఓ ప్రముఖ ఆసుపత్రిగా నిమ్స్ నిత్యం వేలాది మందికి సేవలు అందిస్తున్నది. అందులో విద్యార్థుల పాత్ర చాలా ఉంది, దాదాపు ముప్పై పైగా విభాగాలలో వివిధ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. శనివారం ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన వారోత్సవాలలో భాగంగా ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన ర్యాలీలో వైద్యులు నిర్వహించారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సహాయ సహకారాలతో దేశంలోనే అత్యున్నత స్థాయి రోగ నిర్ధారణ, చికిత్సలో ఉపయోగించే వివిధ పరికరాలు సమకూర్చుకోవడం ద్వారా ఖచ్చిత మైన రోగ నిర్ధారణ, చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి అని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమానికి అతిధులుగా డీన్ డాక్టర్ లిజా రాజశేఖర్, మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ గారు, ఎక్జిక్యూటివ్ రిజిస్ట్రార్ డా. శాంతివీర్‌లు హాజరయ్యారు. సంస్థలో ఉన్న అధునాతన వసతులను ఉపయోగించుకొని ఫిజియథెరపీ, నర్సింగ్ మరియు వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలషించారు. రోగులకు సేవ చేయడం ఓ గొప్ప వరం, అవకాశం గా భావించాలని ఉద్భోదించారు. విద్యార్థులు వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రిన్సిపాల్స్ దృష్టికి తేవాలని సూచించారు. ఈ ర్యాలీ లో ఫిజియోథెరపీ కళాశాల, వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News