Saturday, July 27, 2024

ఆగండి.. ఆలోచించండి దయచూపండి

- Advertisement -
- Advertisement -

Nirbhaya-case

సుప్రీం కోర్టులో నిర్భయ దోషులు వినయ్, ముఖేష్ క్యూరేటివ్ పిటిషన్లు, అన్ని అంశాలను పరిశీలించాలని సుప్రీంకు వినయ్ కుమార్, ముఖేష్ వినతి

న్యూఢిల్లీ : ఉరికి అతి సమీపంలో నిలిచిన నిర్భయ దోషి ఒకరు చివరిసారి కనికరం కోసం అభ్యర్థించారు. నిర్భ య దోషులు వినయ్ కుమార్ శర్మ, ముఖేశ్ గురువారం సుప్రీంకోర్టులో వేర్వేరుగా క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి తుది ప్రయత్నాలకు దిగారు. దోషులకు మరణశిక్ష నుంచి ఊరట ఇచ్చేందుకు శిక్షపై సమీక్షకు వీలు కల్పించే క్యురేటివ్ పిటిషన్ తుది మార్గంగా ఉంది. ఈ నెల 22వ తేదీన నలుగురు నిర్భయ దోషులను ఉరితీయాలని ఢిల్లీ కోర్టు ఇటీవలే డెత్‌వారంట్లు జారీ చేసింది. ఈ మేరకు బక్సర్ జైలు నుంచి తగు సంఖ్యలో ఉరితాళ్లను తెప్పించే ఏర్పా ట్లు కూడా జరుగుతున్నాయి. తన చిన్న వయస్సును పరిగణనలోకి తీసుకోకుండా, ఏకంగా మరణశిక్ష విధించారని, దీనిని కుదించాల్సి ఉందని, శిక్షపై సమీక్ష జరగాల్సి ఉందని దోషి తమ లాయరు ద్వారా తెలియచేసుకున్నారు.

పిటిషనరు సామాజిక ఆర్థిక దుస్థితి, వృద్ధులైన ముదుసలి తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, అన్నింటికీ మించి జైలులో ఇన్నేళ్ల సత్ప్రవర్తనను దృష్టిలో పెట్టుకుని అయినా శిక్షపై పునరాలోచన జరగాల్సి ఉందని శర్మ తరఫు లాయర్ తెలిపారు. మంచివాడుగా మారేందుకు వీలైన సంస్కరణల ప్రక్రియను దృష్టిలో పెట్టుకోవల్సి ఉందన్నారు. సముచితమైన కారణాలను సరైన విధంగా పరిశీలనలోకి తీసుకోకుండా వెలువడుతున్న శిక్షతో న్యాయ పంపిణీలో ఘోర తప్పిదం చోటుచేసుకుంటుందని లాయర్ తెలిపారు. ఈ దోషి గురించి విడిగా ఆలోచించకుండా, కీలక విషయాలను విస్మరించి అందరితో పాటు శిక్ష విధించారని పేర్కొన్నారు. సమాజంలోని సార్వత్రిక విచక్షణను దృష్టిలో పెట్టుకుని, ప్రజా నిరసనలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించినట్లుగా ఉందని ఆక్షేపించారు.

ఇంతకు ముందు మరణశిక్షలను పలు అంశాల ప్రాతిపదికన యావజ్జీవ శిక్షలుగా తగ్గించడం జరిగింది. అయితే ఈ కేసులో ఇటువంటివి ఏమీ పట్టించుకోలేదని, కొన్ని సందర్భాలలో వెలువడ్డ తీర్పులు నిర్థిష్టంగా మరణశిక్షపై చట్టాల మార్పులకు దోహదం చేశాయని, అయితే ఈ ఉదంతంలో కేవలం వీరికి మరణశిక్ష విధించడమే పరమావధి అనే పద్ధతిలో వ్యవహారం సాగిందని తెలిపారు. ఈ ఘటన తరువాత దేశంలో అత్యాచారం, హత్య ఉదంతాల కేసులు 17 వరకూ నమోదు అయ్యాయి. వీటిలో మరణశిక్షలను తగ్గించిన సందర్భాలు ఉన్నాయని లాయర్ తమ పిటిషనర్ తరఫున పేర్కొన్నారు.

Nirbhaya case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News