Sunday, May 5, 2024

ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చండి

- Advertisement -
- Advertisement -

Nirbhaya convict

 

నిర్భయ దోషి పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ దాఖలు

న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచార ఘటన దోషుల్లో ఒకడైన పవన్‌కుమార్ గుప్తా శుక్రవారం సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. తన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని ఆ పిటిషన్‌లో కోరాడు. దీంతో పాటు ట్రయల్ కోర్టు ఇచ్చిన డెత్ వారెంట్‌పై స్టే విధించాలని అతడి తరఫు న్యాయవాది ఎపి సింగ్ దాఖలు చేశారు. నిర్భయ కేసులో మరణ శిక్ష విధించిన నలుగురు దోషుల్లో ఇప్పటివరకు ఎలాంటి న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోనిది పవన్ గుప్తా ఒక్కడే. ఈ కేసులో దోషులైన ముకేశ్ కుమార్ సింగ్( 32), వినయ్ కుమార్ శర్మ(26), అక్షయ్ కుమార్(31) ముగ్గురూ రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటిషన్లు దాఖలు చేయడం.. అవి తిరస్కరణకు గురవడం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ ముకేశ్, వినయ్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సుప్రీంకోర్టు వారి పిటిషన్లను తిరస్కరించింది.

క్షమాబిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంపై అక్షయ్‌కుమార్ ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. ఉరిశిక్ష అమలును జాప్యం చేసేందుకు నిర్భయ దోషలు ఒకరితర్వాత ఒకరు క్యురేటివ్ పిటిషన్లు, క్షమాబిక్ష అభ్యర్థనలు దాఖలు చేస్తూ కాలయాపన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో వారి ఉరితీత అనేక సార్లు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరి తీసేందుకుఈ నెల 17l ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది. అయితే ఇప్పుడు పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మరోసారి వీరి ఉరితీత అమలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Nirbhaya convict Pawan Gupta files curative petition
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News