Saturday, July 27, 2024

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నిరూప్‌రెడ్డి నియామకం

- Advertisement -
- Advertisement -

Niroop appointment as Supreme Court Senior Advocate

హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన న్యాయవాది పి.నిరూప్‌రెడ్డిని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. భారత అత్యున్నత న్యాయస్థానంలో 3 దశాబ్దాలుగా ప్రాక్టీస్ చేసిన నిరూప్‌రెడ్డికి ఈ హోదా లభించింది. ప్రముఖ న్యాయవాది, మాజీ స్పీకర్, మాజీ మంత్రి పి రామచంద్రారెడ్డి కుమారుడైన నిరూప్ రెడ్డి తెలంగాణ నుండి సుప్రీం కోర్టు గుర్తించిన మొదటి సీనియర్ న్యాయవాది కావడం విశేషం. ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్రం నుండి అపెక్స్ కోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈనెల 8న ఫుల్ కోర్ట్ నిరూప్‌రెడ్డిని సీనియర్ అడ్వకేట్‌గా నియమించింది. కాగా నిరూప్‌రెడ్డి సుప్రీం కోర్టు న్యాయవాదిగా 30 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది.

కాగా 31 జాతీయ ప్రాముఖ్యత కలిగిన సున్నితమైన విషయాలపై, ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా, ఎన్విరాన్‌మెంటల్ లా, ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ లా, ల్యాండ్ రంగాలలో 31 తీర్పులను ఇప్పటి వరకు ఆయన నివేదించారు. ముఖ్యంగా వ్యవసాయ చట్టాలు, రాజ్యాంగ చట్టాలపై నిరూప్‌రెడ్డి తనదైన శైలిలో కోర్టులో సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఇదిలావుండగా నిరూప్‌రెడ్డి మాజీ అడ్వకేట్-జనరల్, ఆంధ్ర ప్రదేశ్, అదనపు సొలిసిటర్-జనరల్ ఆఫ్ ఇండియా విఆర్ రెడ్డి, మాజీ సొలిసిటర్-జనరల్ ఆఫ్ ఇండియా గోపాల్ సుబ్రమణ్యం వద్ద సుదీర్ఘం పని చేసిన అనుభం ఉంది. ముఖ్యంగా 2013, -2016 సంవత్సరాల్లో సుప్రీంకోర్టులో గోవా రాష్ట్రానికి, ఢిల్లీలోని ఇతర ఫోరంలకు సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్ న్యాయవాదిగా, ఢిల్లీ, షిల్లాంగ్‌లో మేఘాలయ రాష్ట్రానికి అదనపు అడ్వకేట్- జనరల్‌గా కూడా ఆయన పనిచేశారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది, మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి కుమారుడు నిరూప్‌రెడ్డి తన తండ్రి న్యాయవాద వృత్తిని వారసత్వం స్వీకరించారు.

నిరూప్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ ఢిల్లీలోని అపెక్స్ కోర్టు వరకు సుదీర్ఘ ప్రయాణం సాగించారు. చట్టంలోని వివిధ శాఖలకు, ముఖ్యంగా చట్టపరమైన అభివృద్ధి, సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన చట్టం విస్తృతమైన వాదనలను వినిపించడంలో ఆయన శైలిని ప్రశంసనీయమని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా విశ్రాంత న్యాయమూర్తుల కోటాలో జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి, జస్టిస్ నౌషద్ అలీకి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హోదా కల్పించింది. జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా, బిహార్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. జస్టిస్ నౌషద్ అలీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ హైకోర్టులో న్యాయమూర్తిగా చేశారు. 18 మంది న్యాయమూర్తులతో పాటు ఏడుగురు విశ్రాంత న్యాయమూర్తులకు సీనియర్ న్యాయవాది హోదా కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News