Friday, September 13, 2024

తగ్గింపు ధరలకే హెల్మెట్లు

- Advertisement -
- Advertisement -

కేవలం హెల్మెట్లు ధరించక పోవడం వల్లనే రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది మరణిస్తున్నారని, ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహన తయారీదారులు వాహన కొనుగోలుదారులకు తగ్గింపు ధరకు లేదా సహేతుకమైన ధరలకు హెల్మెట్లను అందించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2022 లో హెల్మెట్ ధరించక పోవడం వల్లనే రోడ్డు ప్రమాదాల్లో 50,029 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అందువల్ల వాహన కొనుగోలుదారులకు హెల్మెట్‌లపై కొంత డిస్కౌంట్ ఇవ్వగలిగితే ప్రజల ప్రాణాలను కాపాడగలమనిపిస్తోందని మంత్రి వాహనతయారీ దారులను అభ్యర్థించారు.

పాఠశాల బస్సులకు కూడా పార్కింగ్ ఏర్పాటుకు సంబంధించి ఒక ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మోటారు వాహనాల (సవరణ) చట్టం ,2019 ట్రాఫిక్ నేరాలపై భారీగా పెనాల్టీలను అమలు చేసిందని, వాస్తవానికి దీన్ని సమర్థంగా అమలు చేయడం కూడా పెద్ద సవాలుగా ఉందన్నారు. దేశంలోని ప్రతి తాలూకాలో డ్రైవింగ్‌స్కూల్ ప్రారంభించాలన్నది తన ఆశయమని తెలిపారు. “అనుకోని గాయాల నివారణకు జాతీయ వ్యూహం” పేరున ఆరోగ్య మంత్రిత్వశాఖ నుంచి విడుదలైన కొత్త నివేదిక ప్రకారం దేశం లోని రోడ్డు ప్రమాదాల్లో అనుకోని గాయాల వల్లనే చాలా మంది చనిపోతున్నారని, ఈ మరణాల్లో 43 శాతం కన్నా ఎక్కువ దీనివల్లనే అని తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News