Tuesday, April 16, 2024

నిజామాబాద్‌లో పసుపు బోర్డులు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో అయిదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని వాగ్దా నం చేసిన ఎంపి అర్వింద్ ఈ విషయంలో మో సం చేశారని పేర్కొంటూ ‘పసుపు బోర్డు..ఇది మా ఎంపి గారు తెచ్చిన పసుపు బోర్డు‘ అని పేర్కొం టూ పసుపు రంగు ఫ్లెక్సీలను నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఏర్పాటు చేశారు. పసుపు బోర్డు నిజామాబాద్‌లో ఏర్పాటు చేయకపోవడం తో కేంద్ర ప్రభుత్వం, ఎంపిపై నిజామాబాద్ రైతులు కన్నెర్రజేశారు.

పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదనలేదని కేంద్ర వాణిజ్య శాఖ సహా య మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంటులో ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం రైతుల ఆగ్ర హం కట్టలు తెంచుకుంది. పార్లమెంట్ వేదికగా మరోసారి కేంద్రం మోసం బయటపడిందని రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగేళ్లుగా ఎందుకు రాజీనామా చేయడం లేదు?
అందుకు నిరసనగా స్థానిక బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ నిర్వాకాన్ని ఎండగడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న అర్వింద్ తమను మోసం చేశారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాండ్ పేపరు రాసిచ్చినా ఇప్పటికీ పసుపు బోర్డును సాధించకపోవడమే కాకుండా బోర్డును ఏర్పాటు చేయలేమని కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పసుపు బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని అర్వింద్ ఎన్నికల సమయంలో తెలిపారని, మరి నాలుగున్నరేళ్లు గడిచినా బోర్డు సాధించలేకపోతే ఎందుకు రాజీనామా చేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. బిజెపి అగ్రనేతలు రాజ్ నాథ్ సింగ్, రామ్ మాధవ్ వంటి వారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపిని గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని మోసపూరిత హామీ ఇచ్చారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాన్ని ఒప్పించలేని బిజెపి నాయకులు ప్రజల్లో తిరిగే నైతిక హక్కు లేదని వారు ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News