Sunday, April 28, 2024

కేసుల విచారణపై స్టేలకు ఇక 6 నెలల గడువు ఉండదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హైకోర్టులలో సివిల్ లేదా క్రిమినల్ కేసుల విచారణపై విధించే స్టే ఉత్తర్వుల గరిష్ఠ కాలపరిమితి ఆరు నెలు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత ఆ ఉత్తర్వులు వాటికవే రద్దయిపోతాయంటూ 2018లో తాను ఇచ్చిన తీర్పును ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం పక్కనపెట్టింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ అభయక్ ఎస్ ఓకా, జస్టిస్ జెబి పార్దీవాలా, జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

రాజ్యాంగంలోని 162వ అధికరణ మేరకు ఆరు నెలల తర్వాత ఆటోమేటిక్‌గా స్టే ఉత్తర్వులు తొలగిపోయే ఆదేశాలు చ్చే అధికారం సుప్రీంకోర్టుకు లేదని ధర్మాసనం తెలిపింది. ఏ కోర్టులోనైనా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిషరిష్కరించడానికి కాలపరిమితిని రాజ్యాంగపరమైన న్యాయస్థానాలు నిర్దేశించరాదని ధర్మాసనం తెలిపింది. హైకోర్టు పొడిగిస్తే తప్ప ఆరు నెలల తర్వాత హైకోర్టు ఇచ్చే స్టే ఉత్తర్వుల గడువు దానంతటదే ముగుస్తుందని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వకుండా ఉండాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడింది.

క్షేత్ర స్థాయిలో పరిస్థితి కోర్టులకే అధికంగా తెలుస్తుందని, ఏదైనా కేసు ప్రాధాన్యతను నిర్ణయించే అధికారం కోర్టులకే ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అసాధారణ పరిస్థితులు ఎదురైనపుడు ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే కేసుల విచారణకు కాలపరిమితిని కోర్టులు విధించవచ్చని ధర్మాసనం తెలిపింది. కాగా.. సివిల్, క్రిమినల్ కేసుల విచారణపై హైకోర్టు లేదా దిగవ కోర్టు ఇచ్చే స్టే ఉత్తర్వుల కాల పరిమితి ఆరు నెలలు మాత్రమే ఉండాలని, ఆ తర్వాత ఆటోమేటిగ్గా ఆ ఉత్తర్వుల కాలం చెల్లిపోతుందని సుప్రీంకోర్టు 2018 ఏషియన్ రిసర్ఫేసింగ్ తీర్పులో పేర్కొంది.

ఈ తీర్పుపై అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్, ఇతరులు దాఖలు చేసిన వాదనలు పూర్తి చేసిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2023 డిసెంబర్ 13న తన తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం ఈ తీర్పును ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News