Sunday, June 16, 2024

ఆర్‌టిసి లోగ్‌ను క్రియేట్ చేసిన ఇద్దరి పై కేసు

- Advertisement -
- Advertisement -

టిఎస్‌ఆర్‌టిసి లోగోను మార్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఇద్దరు యువకులపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. టిఎస్‌ఆర్‌టిసి పేరును టిజిఎస్ ఆర్‌టిసిగా మార్చుతున్నట్లు లోగ్ క్రియేట్ చేసి ఎండి విసి సజ్జనార్ చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన ఆర్‌టిసి ఎండి విసి సజ్జనార్ ఆర్‌టిసి పేరులో ఎలాంటి మార్పు చేయలేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న లోగోకు తమకు సంబంధంలేదని స్పష్టం చేశారు. నకిలీ లోగోను క్రియేట్ చేసిన వారిపై ఆర్‌టిసి అధికారులు గురువారం చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకున్న అధికారులు కొణతం దిలీప్, హరీష్ రెడ్డి అనే ఇద్దరిపై ఐపిసి 469, 504,505(1),(బి)(సి)తోపాటు ఐటి యాక్ట్‌లోని 67 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చిక్కడపల్లి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News