Sunday, June 16, 2024

బిఆర్‌ఎస్ పార్టీవి శవ రాజకీయాలు: మంత్రి జూపల్లి కృష్ణారావు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు దురలవాట్లు, భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలే కారణమని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన హత్యను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఆ పార్టీ నాయకులు రాజకీయ హత్యగా చిత్రీకరించడం దుర్మార్గపు చర్య అని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో హత్య జరిగినా, రాజకీయ రంగు పులిమి లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని కెటిఆరే చెబుతున్నారని, అలాంటప్పుడు రాజకీయ హత్య అని ద్వంద వైఖరి ప్రదర్శించడం ఆయనకే చెల్లిందని మంత్రి అన్నారు. కెటిఆర్ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. హత్య జరిగిన క్షణాల్లోపే కెటిఆర్, బిఆర్‌ఎస్ నాయకులు రంగంలోకి దిగి ప్రభుత్వంపై , వ్యక్తిగతంగా తనపై దుష్ప్రచారం చేయడాన్ని జూపల్లి తీవ్రంగా ఖండించారు. ఏం జరిగింది, ఎలా జరిగిందని తెలుసుకోకుండానే కావాలనే తనపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శవ రాజకీయాలు చేయడం బిఆర్‌ఎస్‌కు కొత్త కాదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

. ఎక్కడ శవముంటే అక్కడ గద్దలా వాలి నేరారోపణలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. నేనేంటో ప్రజలకు తెలుసని, ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేదని, అందుకే కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా తనను ఆదరిస్తున్నారని అన్నారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక పోతున్నారని అన్నారు. గంట్రావ్‌పల్లి గ్రామంలో జరిగిన మల్లేష్ హత్యకు కూడా రాజకీయ రంగు పులిమారని, ఇప్పుడు శ్రీధర్ రెడ్డి హత్యను కూడా రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. శ్రీధర్ రెడ్డి హత్యపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారని, విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, అప్పటి వరకు బిఆర్‌ఎస్ నాయకులు చేచిఉండాలని సూచించారు. బిఆర్‌ఎస్ నీచ రాజకీయాలు పరాకాష్టకు చేరాయ ని, ఇకనైనా శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని కెటిఆర్‌కు హితువు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News