Friday, April 26, 2024

ఇకపై రాష్ట్రాలకు ‘ప్రత్యేక హోదా’ ఉండదు: నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఇకపై కేంద్రం ఏ రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’(స్పెషల్ కేటగిరి స్టేటస్) కావాలన్న డిమాండ్‌ను పరిశీలించదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెలిపారు. ఇది ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాలకు ఓ పెద్ద దెబ్బ అనుకోవచ్చు. ‘ఒడిశాకు ప్రత్యేక కెటగిరి హోదా’ ఇస్తారా? అని అడిగినప్పుడు ‘14వ ఆర్థిక కమిషన్ కుదరదు అని స్పష్టంగా చెప్పింది’అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై మాటామంతీ సందర్భంగా ఈ విషయం చెప్పారు.

ఆమె ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను ఉదాహరిస్తూ , ఆ రాష్ట్రాల విభజన ప్రారంభంలో ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగింది. కానీ ఇకపై ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని ఫైనాన్స్ కమిషన్ స్పష్టంచేసిందన్నారు. కేంద్ర పథకాలకు 90 శాతం నిధులు వస్తాయన్న ఉద్దేశ్యంతో ఒడిశా, బీహార్ ప్రత్యేక హోదా కావలని పట్టుబడుతున్నాయన్నారు. ప్రస్తుతం వాటికి 60 శాతం నిధులు సర్దుబాటయ్యాయి, ఇతర ప్రయోజనాలు కూడా అందుతున్నాయన్నారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నారని ఆమె తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో ఆయన బీహార్‌కు, ఇతర వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు కేంద్రాన్ని దుమ్మెతిపోశారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News