Tuesday, April 30, 2024

ఎక్కడా రీ పోలింగ్‌కు అవకాశం లేదు : వికాస్ రాజ్

- Advertisement -
- Advertisement -

సి- విజిల్ యాప్ ద్వారా 10,132 ఫిర్యాదులు
రాష్ట్రంలో పోలింగ్ శాతం 71.07 శాతం నమోదు
2018 తో పోల్చితే 2 శాతం తక్కువ నమోదు
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ఎక్కడ రీపోలింగ్‌కు అవకాశం లేదని ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన ప్రధాన కమిషనర్ వికాస్‌రాజ్ తెలిపారు. శనివారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో పోలింగ్ పూర్తిగా ముగిసిన అనంతరం పరిశీలిస్తే 70.74 శాతం ఓటింగ్ నమోదైందని వెల్లడించారు. హైదరాబాదులో అత్యల్పంగా 46.68 శాతం ఓటింగ్ నమోదైనట్లు, మునుగోడులో అత్యధికంగా 91.05 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు. అయితే గతంలో కంటే ఈసారి పోలింగ్ 2 శాతం తక్కువగా నమోదైందని తెలిపారు.

2018 ఎన్నికల సమయంలో పోలింగ్ శాతం 73.37 శాతం నమోదైనట్లు చెప్పారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారని ఈ నెల 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని, అందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసారి ఓట్ ఫ్రమ్ హోమ్ విధానం సత్ఫలితాలను ఇచ్చిందని, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.80 లక్షల మంది ఓటేశారని వెల్లడించారు. సీ విజిల్ యాప్ ద్వారా 10,132 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. 79 నియోజకవర్గాల్లో 75 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 16,005 మంది వృద్ధులు, 9,459 మంది దివ్యాంగులు హోం ఓటింగ్ ఉపయోగించుకున్నారు. 1,80,000 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని థర్డ్ జెండర్ కూడా ఎక్కువ సంఖ్యలో ఓటు వేసినట్లు తెలిపారు. 27,094 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, 7,591 కేంద్రాల వెలుపల సిసి టివి సదుపాయం కల్పించామన్నారు.

ఈ ఎన్నికల్లో 13 వేల కేసులు నమోదు: 
లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉందని, 40 కంపెనీల బలగాలతో భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు లెక్కింపు కేంద్రాల్లో 1,766 లెక్కింపు టేబుళ్లు, 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉంటాయని తెలిపారు. ఆరు నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు అక్కడ 28 టేబుళ్లు ఉంటాయన్నారు. కౌంటింగ్ రోజు ముందుగా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, తరువాత 8.30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం లెక్కింపు సమాంతరంగా కొనసాగుతుంది. ప్రతి టేబుల్‌పై మైక్రో అబ్దర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్,, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారన్నారు. ప్రలోభాల, ఉల్లంఘనలకు సంబంధించి గతం కంటే ఈసారి ఎక్కువ కేసులు నమోదైనట్లు , 2018లో 2400 కేసులు అయితే, ఇప్పడు 13వేల కేసులు నమోదైనట్లు వెల్లడించారు. కొందరు మంత్రులపై కూడా పోలీసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో 49 లెక్కింపు కేంద్రాలు: 
రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వీటిలో హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒక్కొటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను సిద్దం చేసినట్లు వెల్లడించారు.

హైదరాబాద్ జిల్లాలో:  ముషీరాబాద్ ఏవీ కళాశాల దోమల్ గూడ, మలక్ పేట ఇండోర్ స్టేడియం, అంబర్ పేట రెడ్డి ఉమెన్స్ కళాశాల నారాయణగూడ, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, యూసుఫ్ గూడ, సనత్ నగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ ఓయూ, నాంపల్లి జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్ మాసబ్ ట్యాంక్, కార్వాన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మాసబ్ ట్యాంక్, గోషామహల్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కోఠి, చార్మినార్ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల నాంపల్లి, చాంద్రాయణగుట్ట నిజాం కళాశాల బషీర్ బాగ్, యాకత్ పురా సరోజిని నాయుడు వనితా మహా విద్యాలయ నాంపల్లి , బహదూర్ పురా అరోరా కళాశాల బండ్లగూడ, సికింద్రాబాద్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఓయూ, కంటోన్మెంట్ వెస్లీ కళాశాల సికింద్రాబాద్.

రంగారెడ్డి జిల్లాలో : ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి సివిఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ఎల్బీనగర్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, రాజేంద్ర నగర్, చేవెళ్ల, షాద్ నగర్ లార్డ్‌ఇంజనీరింగ్ కళాశాల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి బాలయోగి స్టేడియం, గచ్చిబౌలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News