Saturday, July 27, 2024

సహకార కోటా

- Advertisement -
- Advertisement -

Primary Agricultural Cooperative society

 

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు విడుదలైన నోటీసులు
905 సంఘాలలో 11,765 డైరెక్టర్ పదవులు n మహిళలకు 1810,
బిసిలకు 1810, ఎస్‌సి, ఎస్‌టిలకు 905 పదవుల రిజర్వేషన్ n 6 నుంచి 8
వరకు నామినేషన్ల స్వీకరణ n 15 ఉదయం 7 నుంచి పోలింగ్

హైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం 905 ప్యాక్స్‌లలో 11,765 డైరెక్టర్ పదవులకు జిల్లాల్లోని సహకార ఎన్నికల అథారిటీ సోమవారం ఎన్నికల నోటీసులను జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు, ఆర్‌డిఒలు, జిల్లా సహకార అధికారులతో రాష్ట్ర సహకార కమిషనర్ వీరబ్రహ్మాయ్య, రాష్ట్ర ఎన్నికల సహకార అథారిటీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షించారు. మొత్తం 906 ప్యాక్స్‌లకు గాను మహబూబాద్ జిల్లాలోని ఒక ప్యాక్స్‌కు ఎన్నిక నిర్వహించడం లేదు. ఆ ప్యాక్స్‌లో నిధులు లేకపోవడమే ఇందుకు కారణంగా అధికారులు తెలిపారు. ప్రతీ ప్యాక్స్ వారి నిధులతోనే ఎన్నికలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రతీ ప్యాక్స్‌కు 13 మంది డైరెక్టర్ల చొప్పున 11,765 డైరెక్టర్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. సహకార సంఘాల్లో పోటీ చేయదలచుకున్న అభ్యర్థులు నామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు రూ.500, బిసిలకు రూ.750, ఒసి (ఇతరులు)లకు రూ.వెయ్యి నామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఓటర్లను 13 డైరెక్టర్ వార్డులుగా విభజించి, ఆయా వార్డుల్లో ఏ రిజర్వేషన్‌కు సంబంధించిన సభ్యులు ఎక్కువగా ఉంటారో.. ఆ డైరెక్టర్ వార్డును ఆ సామాజిక వర్గానికి రిజర్వ్ చేశారు. అలా ఆరు స్థానాలు రిజర్వ్ చేశాక, మిగతా డైరెక్టర్ స్థానాలను ఆన్ రిజర్వుడ్‌కు కేటాయించారు. రెండు డైరెక్టర్ పదవులు మహిళలు, మరో రెండు డైరెక్టర్ పదవులు బిసిలకు, ఒక డైరెక్టర్ పదవి ఎస్‌సి, ఎస్‌టిల్లో ఎవరో ఒకరికి రిజర్వు చేశారు. ఆ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 906 ప్యాక్స్‌ల్లో 11,765 డైరెక్టర్ పదవులుంటే, వాటిల్లో మహిళలకు 1810 డైరెక్టర్ పదవులు, బిసిలకు 1810 డైరెక్టర్ పదవులు రిజర్వు చేశారు. ఎస్‌సి, ఎస్‌టిలకు 905 డైరెక్టర్ పదవులు రిజర్వ్ చేయగా, మిగతావి ఒపెన్ (ఆన్‌రిజర్వు)చేశారు.

ఒక్కో డైరెక్టర్ ఒక పోలింగ్ బూత్
ఒక్కో డైరెక్టర్ ఎన్నికకు ఒక్కో పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో 11,765 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ముగ్గురు ఎన్నికల సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికల నిర్వహణకు దాదాపు 30 వేల మంది సిబ్బందికి మొదటి విడత శిక్షణ పూర్తి చేసినట్లు సహకార శాఖ వర్గాలు వెల్లడించాయి. నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్లు ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు స్వీకరించనున్నారు. తొమ్మిదో తేదీన నామినేషన్ల పరిశీలన, 10వ తేదీన ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా, గుర్తు కేటాయింపులు చేస్తారు. ఈ నెల 15వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. డిసెంబర్ 2018,
సమాన ఓట్లు వస్తే లాటరీ
ఒక్క అభ్యర్థి రెండు సెట్ల నామినేషన్ పత్రాలకు మించి దాఖలు చేయరాదు. అలాగే ఒక్క డైరక్టర్ వార్డులో ఓటరుగా నమోదైన వ్యక్తి మరో డైరెక్టర్ వార్డులో పోటీ చేయవచ్చు. సదరు అభ్యర్థిని బలపరిచి, ప్రతిపాదించే వ్యక్తులు మాత్రం ఆయా వార్డుల్లోనే ఓటు హక్కు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఒకరిని మాత్రమే ప్రతిపాదించాల్సి ఉంటుంది. బలపరిచే, ప్రతిపాదించే వ్యక్తులు ఓటు వేసేందుకు అర్హులై ఉండాలి. నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారికి ఇచ్చే సమయంలో తప్పనిసరిగా ప్రతిపాదిస్తున్న వ్యక్తి పోటీ చేసే వ్యక్తితో ఉండాల్సి ఉంటుంది. ఇక పోటీ చేసే అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లు వస్తే విజేతను లాటరీ పద్దతిలో ఎంపిక చేస్తారు. ఆ లాటరీలో ఎంపికైన అభ్యర్థికి మిగిలిన వారికన్నా ఒక్క ఓటు ఎక్కవ వచ్చినట్లు పరిగణించి, ఆ అభ్యర్థి ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. ఎక్కడైనా, ఏదైనా సమస్య ఉంటే అధికారులను సంప్రదించాలి. ప్రభుత్వం నిబంధనల మేరకు ఎన్నికలు జరుగుతుంటాయి.

ఎన్నికల గుర్తులివే
సహకార సంఘాల్లో పోటీ చేసే అభ్యర్థులకు తెలుగు అక్షర క్రమం ప్రకారం 24 గుర్తులు కేటాయిస్తారు. ఇవి సరిపోకపోతే అదనంగా 53 గుర్తులను కూడా సిద్ధంగా ఉంచారు. మొదటగా ఇచ్చే 24 గుర్తుల్లో బీరువా, బ్యాట్, బ్యాటరీలైట్, బ్రష్ , బకెట్, కొబ్బరికాయ, మంచం,కప్ సాసర్, డీజిల్ పంపు, గౌను, ఫ్యాన్, గ్యాస్ సిలిండర్ , గ్యాస్ పొయ్యి, గాజు గ్లాసు , గాలిపటం, కుండ, ప్రెషరకుక్కర్, ఉంగరం, రంపం, కత్తెర, పలక, స్టూల్, ఊత కర్ర, కుళాయి గుర్తులను సిద్ధంగా ఉంచారు.

Notification for Primary Agricultural Cooperative society
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News