Saturday, September 21, 2024

అదరగొట్టే మాస్ స్టెప్పులతో జాన్వీ-ఎన్ టిఆర్

- Advertisement -
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ దేవర. ఈ సినిమా ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో భారీ అంచనా లతో ఎన్టీఆర్ ఆర్ట్, యువసుధ ఆర్ట్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృ ష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే సెన్సేషన్ అయిన రెండు సాంగ్స్ కు తోడుగా ఇప్పుడు మూడో పాటను కూడా సిద్ధం చేశారు మేకర్స్.

‘దావుడి…’ అంటూ సాగే ఈ సాంగ్‌ను బుధవారం రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఎన్టీఆర్‌తో కలిసి జాన్వీ కపూర్ డ్యాన్స్ చేస్తున్న పోజ్ ఈ సాంగ్‌పై అంచనాలను పెంచేసింది. ఇక ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ మాస్ స్టెప్పులు నెక్స్ లెవెల్‌లో ఉండబోతున్నాయట. ఈ సాంగ్ సినిమాకే హైలైట్‌గా ఉండబో తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద ర్ అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News