Sunday, April 28, 2024

‘వార్ 2’ సినిమా నుంచి మరో క్రేజీ న్యూస్

- Advertisement -
- Advertisement -

మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్‌లో ‘వార్ 2’ అగ్ర స్థానంలో ఉంటుంది. ఎన్టీఆర్, – హృతిక్ రోషన్ కలయికలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పై ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం మార్చి నుంచి ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చాడని తెలిసింది. మార్చి మొదటి వారానికి ‘దేవర’ షూటింగ్ పూర్తి అవుతుందని.. అనంతరం ఓ వారం విశ్రాంతి తర్వాత మార్చి రెండో వారం నుంచి తారక్ ‘వార్ 2’ ప్రాజెక్ట్ కోసం డేట్స్ కేటాయించాడని సమాచారం. ముందుగా ఎన్టీఆర్,- హృతిక్ రోషన్‌లపై ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారని టాక్ నడుస్తోంది.

మరి ఇద్దరి కాంబినేషన్ అంటే.. బాక్సాఫీస్ షేక్ అయినట్టే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక వార్ 2 సినిమా కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. ఇది ఇద్దరి స్నేహితుల కథ అని, ఇద్దరు స్నేహితులు చివరకు శత్రువులు గా మారితే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ సినిమా సాగుతుందట. ఏది ఏమైనా వార్ 2 సినిమా అనేది యాక్షన్ ఫిల్మ్. మరి యాక్షన్ ఫిల్మ్‌లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News