బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టిఆర్ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘వార్-2’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకోసం చిత్ర యూనిట్ ప్రమోషన్లు ప్రారంభించారు. అయితే సినిమా హీరోలో హృతిక్, తారక్‌లు తమదైన స్టైల్‌లో సోషల్‌మీడియాలో ప్రమోషన్స్ చేశారు. అది కూడా సోషల్‌మీడియాలోని హ్యాష్‌ట్యాగ్‌ల కోసం.
మొదట ఈ సినిమా గురించి హృతిక్ రోషన్ పోస్ట్ పెట్టారు. ‘వార్ మొదలైంది. ఒక హ్యాష్‌ట్యాగ్ ఈ యుద్ధం గురించి మీకు చెబుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ పోస్ట్‌కు ‘HrithikVSNTR’ అనే దాన్ని జోడించండి. ఈ ట్యాగ్‌తో నేను ప్రత్యేకమైన సమాచారాన్ని పంచుకుంటాను’ అని పోస్ట్ చేశారు. దీనిపై ఎన్టిఆర్ స్పందిస్తూ.. ‘ఆప్‌డేట్స్, ప్రత్యేక విశేషాలు పంచుకుంటారా..! ‘NTRvsHrithik’ అనేది ఉపయోగించుకోవాలని మనం ముందే మాట్లాడుకున్నాం కాదా. ఎందుకంటే అసలు యుద్ధం ప్రారంభం అయ్యేది ఈ విధంగానే కాబట్టి ఇదే వాడాలి’ అని తెలిపారు.
దీనిపై మళ్లీ హృతిక్ స్పందించారు. ‘మీరు చెప్పేది బాగానే ఉంది తారక్. కానీ, హ్యాష్‌మాత్రం నాదే ఉపయోగించాలి. ఈ విషయాన్ని పెద్దది చేయొద్దు’ అని పోస్ట్ చేయగా.. ‘నేను చెప్పేది బాగుందని మీరే అంటున్నారు కాబట్టి. నేనే గెలిచినట్లు. హృతిక్ సర్’ అంటూ రాసుకొచ్చారు. మొత్తానికి వీరిద్దరు తమ సినిమా టైటిల్‌కి తగ్గట్టే సోషల్‌మీడియాలో వార్ చేసుకుంటున్నారని అభిమానులు అంటున్నారు.