Wednesday, April 2, 2025

నియమనిబంధనలకు లోబడి మొహర్రం చేసుకోండి: యోగి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ముస్లింలను హెచ్చరించారు. మొహర్రం పండుగను నియమనిబంధనలకు లోబడి చేసుకోవాలని లేదంటే ఇంట్లో కూర్చోవాలని హెచ్చరించారు. ఆదివారం పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ హెచ్చరిక చేశారు.

‘‘ఇదివరలో మొహర్రం ఊరేగింపు అప్పుడు రోడ్లను ఖాళీ చేయించేవారు. కానీ నేడు మొహర్రం గురించి జనం అంతగా పట్టించుకోవడంలేదు’’ అన్నారు. ఇదివరలో సంతాప దినంలో(మాతం) పేదల గుడిసెలను ఊరేగింపు కోసం కూల్చేసేవాళ్లు. ‘‘తాజియ పేరిట ఇళ్లు కూల్చేసేవాళ్లు. రాగి చెట్లను నరికేసేవాళ్లు. నేడు, ఏ పేదవాడి గుడిసె కూల్చడం జరగదు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం పండుగ నియమాలను రూపొందించిందన్నారు. ‘‘ మీరు వేడుక చేసుకోవాలంటే నియమనిబంధనలకు లోబడి చేసుకోండి. లేకుంటే ఇంట్లో కూర్చొండి’’ అని నిర్ద్వంద్వంగా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News