Sunday, June 16, 2024

హిమాచల్ కు ఒడిశా ప్రభుత్వం రూ.5 కోట్ల విరాళం

- Advertisement -
- Advertisement -

హిమాచల్ ప్రదేశ్: భారీ వర్షాల కారణంగా వేల కోట్ల ఆస్తినష్టంతోపాటు ప్రాణనష్టం కూడా సంభవించిన కారణంగా ఒడిశా ప్రభుత్వం రూ.5 కోట్ల విరాళాన్ని హిమాచల్ ప్రదేశ్‌కు బుధవారం పునరావాస కార్యక్రమాల కోసం అందజేసింది. దీనిపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్‌సింగ్ సుఖు కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కూడా రూ. 51 కోట్ల వరకు సహాయాన్ని అందించాయి. ప్రకృతి వైపరీత్యాల పునరావాస నిధి కింద సామాన్య ప్రజలు కూడా తమ సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆపద రాహత్ కోశ్‌కు రూ. 168 కోట్లు అందాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News