Sunday, October 6, 2024

లబ్ధిదారులకు పాత పింఛన్లు…. పెంచిన పింఛన్ కోసం ఎదురుచూపులు

- Advertisement -
- Advertisement -

కొత్త విధానాలు ఖరారు కాకపోవడంతో పాత పద్ధతిలో పంపిణీ
మార్చి తరువాత పెరగవచ్చని అధికారులు వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఢంకా మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్… ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు వ్యుహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తుంది. సిక్స్ ఫార్ములాలో భాగంగా పగ్గాలు చేపట్టిన మొదటి రోజే మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌక్యరం కల్పించారు. దీంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలక వరకు పెంచి ప్రజల నుంచి  రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రశంసలు అందుకుంది. ఇంతటితో ఆగకుండా గృహ జ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా, రేషన్‌కార్డులు ప్రజలు లబ్ధి పొందేందుకు ప్రజా పాలన పేరుతో ఆయా గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించింది. ఈ క్రమంలోనే ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులు పెన్షన్ పెంపు విషయంలో ప్రభుత్వ ప్రకటన కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో వయసు ప్రామాణికంగా చేసుకుని ఇస్తున్న పింఛను రూ.2016, దివ్యాంగుల పింఛను రూ.3,016 ఉంది. కానీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తాము అధికారం చేపడితే వయసు ప్రామాణికంగా చేసుకుని ఇచ్చే పింఛను రూ. 4 వేలకు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలు చేస్తామని ప్రకటించింది. అయితే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తమకు కొత్త పెన్షన్ ఎన్నడు అందజేస్తుందోననని పేదలు ఎదురుచూస్తున్నారు. జనవరి నుంచి ప్రభుత్వం తమకు పెన్షన్ పెంచుతుందని ఆసక్తిగా చూస్తున్నారు.

రాష్ట్రంలో పింఛన్లదారుల వివరాలు చూస్తే 15,98,729 మంది వృద్ధాప్య పింఛన్లు, 15,60,707 మంది వితంతువులు, 5,03,613 దివ్యాంగ పింఛన్లు 4,24,585 బీడీ కార్మిక పింఛన్లు, 1,42,394 ఒంటరి మహిళ పింఛన్లు, 65,307 గీత కార్మికుల పింఛన్లు, 37,145 చేనేత కార్మికుల పింఛన్లు, 35,998 హెచ్‌ఐవి బాధితులు పింఛన్లు ఉన్నాయి. ఇలా మొత్తం 43,96,667 మంది పింఛన్లు తీసుకుంటుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థతి చూస్తుంటే ఈ నెల మాత్రం పాత పద్ధతిలోనే పెన్షన్లు ఇచ్చే వాతావరణం కనబడుతోంది. కొత్త పింఛన్ల విషయంలో విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో ఈ నెల కూడా పాత పెన్షన్లే ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News