Sunday, June 23, 2024

మా ఎమ్మెల్యేలు కాలు జారరు, చేయి చేజారరు!

- Advertisement -
- Advertisement -

డిసెంబర్ 9వ తేదీన చప్పట్లు కొడుతుంటే రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తారు
రాష్ట్రంలో 76 నుంచి 86 వరకు కాంగ్రెస్ పార్టీకి సీట్లు వస్తాయి

మనతెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్ కంటే ముందే తాను ఈ విషయాన్ని చెప్పానని, వచ్చేది కాంగ్రెస్ అని ఆయన తెలిపారు. నేటి నుంచి పండుగ ప్రారంభమవుతుందని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో 76 నుంచి 86 వరకు కాంగ్రెస్ పార్టీకి సీట్లు వస్తాయని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి సిఎం అని తన మనసులో మాట ఆయన చెప్పారు. రాష్ట్రంలో రేవంత్ ప్రాణం పెట్టి కొట్లాడారని ఆయన తెలిపారు. డిసెంబర్ 7 సాయంత్రం ఎల్బీ స్టేడియంలో పడుకుంటానని మీడియా వచ్చి తనను ఇంటర్వ్యూ చేయాలన్నారు. దుప్పటి కూడా రెడీ చేసుకున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 9వ తేదీన చప్పట్లు కొడుతూ ఉంటే రేవంత్ రెడ్డి ప్రమాణం చేయడం ఖాయమని బండ్ల గణేష్ చెప్పారు. అంతేకాకుండా తమ ఎమ్మెల్యేలు కాలు జారరు, చేయి చేజారరని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News