హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతం ఔటర్ రింగ్గు రోడ్డు పై టయోటో కారు బీభత్సం సృష్టించింది. హిమాయత్ సాగర్ వద్ద బ్రేక్ డౌన్ కావడంతో కారు టైర్ మారుస్తున్న రికవరీ వ్యాన్ డ్రైవర్ ను టయోటో కారు ఢీ కొట్టింది. డ్రైవర్ శివ కేశవ గాలిలో ఎగిరి 50 మీటర్ల దూరంలో పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్ నుండి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదంలో చోటుచేసుకుంది. హిమాయత్ సాగర్ ఎగ్జిట్ 17 వద్దకు రాగానే సడన్ గా కారు ఆగిపోయింది. వెంటనే ఔటర్ సిబ్బందికి కారు డ్రైవర్ సమాచారం ఇచ్చాడు. రికవరీ వ్యాన్ డ్రైవర్ శివ కేశవ స్పాట్ కు చేరుకున్నారు. బ్రేక్ డౌన్ కావడంతో కారు టైరు మారుస్తుండగా మితిమీరిన వేగంతో టయోటో కారు దూసుకొచ్చి కారును ఢీకొట్టింది. వ్యాన్ డ్రైవర్ శివకేశవ 50 మీటర్ల దూరంలో ఎగిరిపడి స్పాట్ లోనే ప్రాణాలు విడిచాడు.