Sunday, October 6, 2024

అరికెపూడి గాంధీనే అన్నా..ఆంధ్ర సెటిలర్స్ ను అనలేదు: కౌశిక్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

అరికెపూడి గాంధీతో వివాదంలో లోకల్, నాన్ లోకల్ అంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలసిందే. అయితే.. ఆ వ్యాఖ్యలు కేవలం గాంధీని ఉద్దేశించి మాత్రమే అన్నానని కౌశిక్ రెడ్డి చెప్పారు. అరికేపూడి గాంధీ చెప్పినట్లు ఇది కౌశిక్ రెడ్డికి గాంధీకి మధ్య జరుగుతున్న వ్యక్తిగత యుద్ధం మాత్రమేనని.. ఇక్కడ నివసిస్తున్న ఆంధ్ర సెటిలర్స్ పై తనకు గౌరవం ఉందన్నారు.

ఈ మేరకు మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి.. ఇక్కడ నివసిస్తున్న ఆంధ్ర సెటిలర్స్ కి కాలులో ముల్లు గుచ్చుకున్న పంటితో తీస్తానని గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పారు. దానికి అనుగుణంగానే పాలన జరిగింది.అరికెపూడి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే పార్టీ కండువా కప్పుకోవాలి. నేను చేసిన తప్పేంటనేది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అరెకపూడి గాంధీ ప్రజలను భయభ్రాంతులను గురిచేశారు. అరెకపూడి రౌడీయిజం చూసేందుకు ప్రజలు ఓట్లు వేశారా?. సమాజానికి పోలీసులు ఏం చెప్పాలనుకుంటున్నారు” అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News