Tuesday, October 15, 2024

లెబనాన్‌లో మళ్లీ పేలుళ్లు

- Advertisement -
- Advertisement -

బీరూట్ : లెబనాన్‌లో పలు చోట్ల బుధవారం వాకీటాకీలు పేలిన ఘటనల్లో తొమ్మండుగురు మృతి చెందారు. 300 మంది వరకూ గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. పలు చోట్ల ఉన్న హెజ్బోల్లా కీలక స్థావరాలలో వాకీటాకీలు పేలడం , మంటలు చేలరేగడం సంచలనానికి దారితీసింది. ఒక్క రోజు క్రితమే ఈ దేశంలో పేజర్ల విస్ఫోటనంలో 12 మంది దుర్మరణం చెందారు. వేలాదిగా గాయపడ్డారు. ఇప్పుడు వాకీటాకీలు పేలిన ఘటనలతో గందరగోళ పరిస్థితులు ఏ ర్పడ్డాయి. పేజర్ల పేలుడులో మృతుల అంత్యక్రియలు జరుగుతున్న చోటనే ఇప్పుడు వాకీటాకీలు పేలడం, అక్కడనే కొందరు కుప్పకూలడంతో విషాదం నెలకొంది. ఇప్పుడు ఎన్ని వాకీటాకీలు పేలాయనేది పూర్తి స్థాయిలో స్పష్టం కాలే దు. కమ్యూనికేషన్స్ వ్యవస్థ పలు చోట్ల ల్యాండ్‌లైన్ టెలిఫోన్ల కేంద్రాల్లో పేలుళ్లతో నిలిచిపోయింది.

దీనితో ఇప్పుడు జరిగిన పలు రకాల పేలుళ్లపై చివరికి వార్తా సంస్థలకు కూ డా సరైన సమాచారం అందడం లేదని వెల్లడైంది. ఇరాన్ మ ద్దతుతో సాగుతోన్న హెజ్బోల్లా పతనానికి ఇజ్రాయెల్ గూఢచార్య సంస్థ మొసాద్ ఈ విధంగా దాడులకు పురికొల్పి ఉం టుందని అనుమానిస్తున్నారు. తాము ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు దిగినట్లు , అక్కడి వైమానిక స్థావరాలను రా కెట్లతో దెబ్బతీసినట్లు బుధవారం ఈ రెబెల్స్ సంస్థ తెలిపిం ది.తైపే(తైవాన్): లెబనాన్, సిరియా దేశాల్లో ఉగ్రవాద గ్రూ పు హెజ్‌బొల్లా పేజర్లను పేల్చి తొమ్మిది మంది ప్రాణాలను బలగొనడమే కాక, దాదాపు 3000 మందిని గాయాల పా లు చేసిన సంఘటన ప్రపంచ దేశాలను ఒక్కసారి ఉలిక్కి ప డేలా చేసింది. ఈ పేజర్ల దాడిలో దాదాపు మూడు వేల మం ది గాయపడిన సంగతి తెలిసిందే. వారందరికీ లెబనాన్, సిరియాల్లో వివిధ ఆస్పత్రుల్లో చికిత్సలు చేస్తున్నారు.

ఆ పేజర్ల తయారీలో మా ప్రమేయం లేదు : గోల్డ్ అపోలో వెల్లడి
పేజర్లను తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో కంపెనీ తయారు చేసిందని మొదట వార్తలు రావడంతో గోల్డ్ అపోలో స్పందించింది. వీటిని తయారు చేసింది హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌కు చెందిన బిఎసి కన్సల్టింగ్ కెఎఫ్‌టి కంపెనీ అని బుధవారం వివరించింది. తాము బ్రాండ్ ట్రేడ్‌మార్క్ ఉపయోగించడానికి మాత్రమే అధికారం ఇస్తాం తప్ప తయారీలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News