Saturday, April 27, 2024

మత ప్రవక్తను దూషించిన వ్యక్తికి పాక్‌లో మరణశిక్ష

- Advertisement -
- Advertisement -

Pak man sentenced to death in blasphemy case

లాహోర్ : పాక్‌లో షియా తెగకు చెందిన వసీం అబ్బాస్ అనే వ్యక్తి మత ప్రవక్తను దూషించిన నేరానికి పంజాబ్ ప్రావిన్స్ లోని న్యాయస్థానం మరణశిక్ష విధించింది. మరణశిక్ష తీర్సును అడిషనల్ సెషన్స్ జడ్జి (ఫైసలాబాద్) రాణా సొహైల్ నిందితునికి అందజేశారని అధికారులు బుధవారం తెలియజేశారు. అంతేకాదు జరిమానాగా పికెఆర్ 500,000 (2820 డాలర్లు కన్నా ఎక్కువ) చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ జరిమానా చెల్లించకపోతే మరో రెండేళ్లు జైలుశిక్ష పొందవలసి ఉంటుందని పేర్కొంది. మత ప్రవక్తను ఆయన అనుచరులను నిందితుడు దూషించినట్టు ఫిర్యాదు అందడంతో ప్రావిన్స్ రాజధాని లాహోర్‌కు 180 కిమీ దూరం లోగల ఫైసలాబాద్ వద్ద ఫ్యాక్టరీ ఏరియా పోలీసులు 2020 జూన్‌లో నిందితుడిని అరెస్టు చేశారు. కొద్ది నెలల క్రితం మతప్రవక్తను దూషించాడన్న నేరారోపణపై శ్రీలంకకు చెందిన మతిస్థిమితం లేని వ్యక్తిని పంజాబ్ ప్రావిన్స్‌లో దారుణంగా హింసించి చంపిన సంఘటన జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News