Tuesday, April 23, 2024

పంజాబ్‌లో పాకిస్థాన్ డ్రోన్‌ స్వాధీనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ను సరిహద్దు భద్రతా బలగం(బిఎస్‌ఎఫ్) స్వాధీనం చేసుకుంది. మానవరహిత ఈ డ్రోన్ ఆదివారం రాత్రి 7.40 గంటలకు భారత భూభాగంలోని అమృత్‌సర్‌లో ఉన్న రజతల్ గ్రామంలోకి ప్రవేశించగానే బిఎస్‌ఎఫ్ దళాలు దానిపై కాల్పులు జరిపారు. క్వాడ్‌కాప్టర్ సరిహద్దు కంచె సమీపంలోని పొలంలో స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఏదైనా సరకును జారవిడిచిందా అని తనిఖీ చేయడం జరుగుతోందని బిఎస్‌ఎఫ్ ప్రతినిధులు తెలిపారు.

చైనా నిర్మిత ఆ డ్రోన్ కాల్పుల వల్ల కూలిపోయిందా లేక బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయి కూలిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని అధికారులు అన్నారు. పంజాబ్‌లో గత వారం కనీసం మూడు పాకిస్థాన్ డ్రోన్లను సరిహద్దు దళం కూల్చేసిందన్నది ఇక్కడ గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News