Saturday, May 10, 2025

ఇస్లాం పేరుతో పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది: ఓవైసీ

- Advertisement -
- Advertisement -

పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి(Terrorism) తర్వాత భారతదేశ వ్యాప్తంగా పాకిస్థాన్‌పై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్.. ఆపరేషన్ సింధూర్‌ని చేపట్టి పాక్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌పై(Pakistan) ఎంఐఎం ఎంపి అసదుద్ధీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశఆరు. ఇస్లాం పేరుతో పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆయన మండిపడ్డారు.

భారత్‌ను మతప్రాతిపదికన విభజించాలని పాక్ ప్రయత్నిస్తోందని అన్నారు. భారత్‌లో 23 కోట్ల మందికిపైగా ముస్లింలు ఉంటున్నారని.. హిందూ, ముస్లింల మధ్య ఘర్షణను పాక్(Pakistan) కోరుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్విజాతి సిద్ధాంతాన్ని మా పూర్తీకులు తిరస్కరించారని ఓవైసీ అన్నారు. ద్విజాతి సిద్ధాంతంపై ఏర్పడిన పాకిస్థాన్.. ఆఫ్ఘానిస్థాన్‌పై ఎందుకు దాడి చేస్తోందని, ఇరాన్‌ సరిహద్దుల్లో ఎందుకు బాంబులు వేస్తోందని, ఆఫ్ఘన్లు, ఇరానియన్లు ముస్లింలు కాదా? ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News