- Advertisement -
న్యూఢిల్లీ: భారత బీఎస్‌ఎఫ్ జవాన్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టింది. 20 రోజుల తర్వాత 182వ బెటాలియన్‌కు చెందిన జవాన్ పూర్ణమ్ కుమార్ షాను పాక్, భారత్ కు అప్పగించింది. ఏప్రిల్ 23న డ్యూటీలో ఉన్న పూర్ణమ్ కుమార్.. ఫిరోజ్‌పూర్ సమీపంలో అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దు దాటి పాక్ భూభాగంలోకి వెళ్లాడు. దీంతో బీఎస్‌ఎఫ్ జవాన్ ను పాక్ రేంజర్స్ అదుపులోకి తీసుకున్నారు. చర్చల అనంతరం బుధవారం అమృత్‌సర్‌లోని అట్టారి సరిహద్దు వద్ద ఉదయం 10.30 గంటల ప్రాంతంలో BSF కానిస్టేబుల్ ను పాకిస్తాన్, భారత అధికారులకు తిరిగి అప్పగించింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన షాను ప్రస్తుతం భద్రతా అధికారులు విచారిస్తున్నారు.
- Advertisement -