Saturday, July 27, 2024

బంగ్లాదేశ్ 233 ఆలౌట్

- Advertisement -
- Advertisement -
pakistan-vs-bangladesh
పాకిస్థాన్‌తో ఏకైక టెస్టు

రావల్పిండి: పాకిస్థాన్‌తో శుక్రవారం ప్రారంభమైన చారిత్రక టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 233 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం సత్ఫలితాన్ని ఇచ్చింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (3), సైఫ్ హసన్ (౦) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. దీంతో బంగ్లాదేశ్ 3 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను కెప్టెన్ మోమినుల్ హక్ తనపై వేసుకున్నాడు. అతనికి వన్‌డౌన్‌లో వచ్చిన నజ్ముల్ హసన్ అండగా నిలిచాడు. ఇద్దరు పాకిస్థాన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ మూడో వికెట్ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అయితే కుదురుగా హక్ (30)ను షాహిన్ అఫ్రిది వెనక్కి పంపాడు. మరోవైపు నజ్ముల్ 44 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు మహ్మద్ మిథున్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మిథు న్ ఏడు ఫోర్లు, సిక్స్‌తో 63 పరుగులు చేశాడు. సీనియర్ ఆటగాడు మహ్మదుల్లా (25) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. వికెట్ కీపర్ లిటన్ దాస్ (33), తైజుల్ ఇస్లామ్ (24) పరుగులు సాధించారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిద్ అఫ్రిది అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. 53 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ అబ్బాస్, హారిస్ సోహైల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

 

pakistan vs bangladesh live score 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News