Friday, July 12, 2024

జనగామ నియోజకవర్గంలో ప్రారంభమైన పల్లా ప్రచారం

- Advertisement -
- Advertisement -

జనగామ : జనగామ నియోజకవర్గ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి శుక్రవారం జనగామ మండల వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. జనగామ మండలం చీటకోడూరు, చౌడారం, మరిగడి, పెద్దతండా (ఎం) గ్రామాల్లో పర్యటించారు. ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థిగా జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మండల వ్యాప్తంగా బిఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు. కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోముందుకు తీసుకెళ్లడానికి అన్ని విధాలుగా కృషిచేస్తామని, ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరముందని అన్నారు. మండల వ్యాప్తంగా స్థానిక నాయకులు, సర్పంచ్‌లు సీనియర్ నేతలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News