Friday, July 11, 2025

బాపట్లలో లారీ బోల్తా: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రానైట్ పలకల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో ముగ్గురు కూలీలు చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను బాపట్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు మార్టూరుకు చెందిన పాలపర్తి శ్రీను(25), తాళ్లూరి ప్రభుదాస్(37), నూతలపాడుకు చెందిన తమ్ములూరి సురేంద్ర(26)గా గుర్తించారు. మార్టూరు నంపచి గుంటూరుకు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News