Saturday, September 23, 2023

జనసమీకరణ ఎలా…

- Advertisement -
- Advertisement -

16న సభకు గులాబీ శ్రేణులు సిద్ధం
17న సభలపై కాంగ్రెస్, బిజెపి నేతల్లో టెన్షన్
సభలతో జిల్లా నేతల్లో హైటెన్షన్

మన తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సార్వత్రిక సమరంకు సమయం సమీపిస్తున్న సమయంలో అధికార,ప్రతిపక్ష పార్టీలు నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలకు జనసమీకరణ ఎలా అన్న దానిపై ఆయా పార్టీల నేతల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16 పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంబించడానికి ఇప్పటికే ము హూర్తం ఖరారు చేసి అందుకు కావలసిన కార్యచరణ పూర్తి చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అయితే వికారాబాద్, రంగారెడ్డి జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవెరి జిల్లాకు సాగు,త్రాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టును సియం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంబించిన అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సియం కెసిఆర్ సభ విజయవంతం చేయడానికి ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుంచి భారీగా జనసమీకరణ చేయడానికి రాష్ట్ర మంత్రులు సబితారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కార్యకర్తల సమావేశం నిర్వహించి జనసమీకరణ భాద్యతలను నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నేతలకు అప్పగిస్తున్నారు. సియం కెసిఆర్ సభకు జిల్లా నుంచి భారీగా జనం తరలివెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.

ప్రాజెక్టు ద్వారా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు నీరు వచ్చే అవకాశం ఉండటంతో స్వచ్చందంగా జనం తరలివెళ్లడానికి సైతం సిద్దమవుతున్నారు. 17 న జనం ఎలా…. ఎన్నికల సమరంకు సై అంటు ఈ నెల 17 న కాంగ్రెస్, బిజెపిలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలకు జన సమీకరణ అయా పార్టీల నేతలకు కత్తిమీద సాములాగా మారింది. జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ సమీపంలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. వంద ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాటుకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే భూమి పూజ నిర్వహించి ఏర్పాట్లు ప్రారంబించారు. తుక్కుగూడ సభ విజయవంతం భాద్యతలు రంగారెడ్డి జిల్లాపై అధికంగా పడనున్నాయి. డిసిసి అధ్యక్షుడు నర్సింహరెడ్డి ఇప్పటికే జిల్లా స్థాయిలో సన్నాహక సమావేశం నిర్వహించి నియోజకవర్గాల టికెట్‌లు ఆశీస్తున్న ఆశావాహూలకు భాద్యతలు అప్పగించారు.

టికెట్ ఆశలు ఉన్న నేతలు ప్రస్తుతం తమకు వచ్చిన బలప్రదర్శన అవకాశం వాడుకుని సభను విజయవంతం చేయాలని ప్లాన్ చేస్తున్న జనసమీకరణ అంత సులువు కాకపోవడంతో టెన్షన్ పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా హల్‌చల్ చేయడం….సభ ప్రాంగణంకు వచ్చే దారులన్ని ప్లెక్సీలు, హోర్డింగ్‌లతో నింపి బడానాయకుల దృష్టిలో పడటానికి ఆరాటపడుతున్నారు. జనసమీకరణపై దృష్టి కన్నాచాలా మంది హోర్డింగ్‌లు, ప్లెక్సీలపై పెడుతున్నారు. సభా ప్రాంగంణం విశాలంగా ఉండటంతో ఎంత మంది జనం వచ్చిన ఖాళీ స్థలం కనిపించడం ఖాయమని అందోళన సైతం చెందుతున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బిజెపి నిర్వహిస్తున్న సభ జనసమీకరణ సైతం బిజెపి నేతలను టెన్షన్ పెడుతుంది.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో కాంగ్రెస్ సభ కన్నా అధికంగా జనసమీకరణ చేయాలని లక్షంగా పెట్టుకున్న పరిస్థితులు మాత్రం అంత అనుకూలంగా కనిపించడం లేదు. బిజెపి సభ జనసమీకరణ భాద్యత పూర్తిగా హైద్రాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలపై ఉండటంతో జిల్లా నేతలు టెన్షన్ పడుతున్నారు. జిల్లాలోని తుక్కుగూడలో సోనియా సభ….పరేడ్ గ్రౌండ్‌లో అమిత్‌షా సభ రెండింటింలో ఎక్కడ జనం ఎక్కువ ఉంటే వారిదే పై చేయి అనే భావన నాయకులలో కనిపిస్తుంది. రాష్ట్రంలో బిఆర్‌యస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెపుకుంటున్న రెండు పార్టీలు జనసమీకరణలో పోటిపడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News