Monday, April 29, 2024

వికారాబాద్ 50ఏళ్ల కల నెరవేరుతుంది: మంత్రి మహేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పాలనా కాలంలో రాష్ట్రంలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే.. నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 26 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నామని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో 9 కళాశాలలకు ప్రారంభించిన తరువాత వికారాబాద్ లో జ్యోతి వెలిగించి నూతన మెడికల్ కళాశాలను మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “వికారాబాద్ లో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు చేసినందుకు సిఎం కెసిఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు కృతజ్ఞతలు. ఏటా 10 వేల మంది విద్యార్థులు చదువులు సాగించి రానున్న రోజుల్లో తెలంగాణను వైద్య దేవాలయంగా మార్చనున్నారు. అహల్లాద తెలంగాణ ఊటీగా పిలవబడే అనంతగిరిలో రూ.230 కోట్ల నిధులు, 30 ఎకరాల స్థలంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు. తక్షణ భవన మరమత్తులకు రూ.8 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ప్రైవేటు మెడికల్ కళాశాలకు ధీటుగా ప్రభుత్వ వైద్య కళాశాలలో సదుపాయాల కల్పన చేస్తాం. వైద్యులను ప్రజలు దేవునితో పోలుస్తారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తరువాత భాద్యతగా పేదలకు వైద్యం అందించాలి. 2023-24లో రాష్ట్రంలో కొత్తగా రంగారెడ్డి జిల్లాతో పాటు మరో 8 వైద్య కళాశాలలను ప్రారంభిస్తాం” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News