Sunday, November 3, 2024

బిఆర్ఎస్ లోకి పెద్దపల్లి కాంగ్రెస్ నేతలు..

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో పొలిటికల్ హీట్ ప్రారంభమైంది. రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ లు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇందులో కాంగ్రెస్, బిజెపి పార్టీలు తమ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసంతృప్తి నేతలంతా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు.

దీంతో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా పెద్దపల్లి కాంగ్రెస్ నేతలు సత్యనారాయణరెడ్డి, రామూర్తిలు తమ కార్యకర్తలతో కలిసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బుధవారం తెలంగాణ భవన్ లో మంత్రి కెటిఆర్ సమక్షంలో వారు బిఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News