Thursday, May 9, 2024

రేవంత్ ప్రజాదర్బార్కు పోటెత్తిన జనం

- Advertisement -
- Advertisement -

విజ్ఞాపనలు స్వీకరిస్తూ, సమస్యలు అడిగి తెలుసుకున్న సిఎం

సత్వర పరిష్కారానికి ఆదేశాలు

ప్రతి వినతిపత్రం ఆన్‌లైన్‌లో ఎంట్రీ, ప్రత్యేక గ్రీవెన్స్ నెంబర్ కేటాయింపు

పిటిషన్‌దారులకు ప్రింటెడ్, ఎస్‌ఎంఎస్ ద్వారా ఎకనాలెడ్జ్‌మెంట్

తొలిరోజు జనంతో కిక్కిరిసిన ప్రజాభవన్

రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఫిర్యాదుదారులు

వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
రంగారెడ్డి జిల్లాలో ధరణి సమస్యలపై అధికంగా అర్జీలు
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందడుగు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రే వంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన మరుసటిరోజే ప్రజాసమస్యలు తెలు సుకుని పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి అధికార నివాసమైన మహాత్మా జ్యోతిభా పూలే ప్రజాభవన్‌లో శుక్రవారం ప్రజాదర్బార్ ని ర్వహించారు. మొదటగా దివ్యాంగుల కు ప్రాధాన్యం ఇచ్చి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని వినతులను స్వీకరించారు. ప్రజా దర్బార్ వే దికకు వివిధ సమస్యలపై విన్నవించుటకు పెద్ద ఎత్తున వచ్చిన ప్రజల విజ్ఞాపనలు స్వీకరించి, వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వెంటనే ప రిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్న ట్లు తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దనసరి అనసూయ (సీతక్క) ఉ న్నారు. ముఖ్యమంత్రి అత్యవసర స మావేశం నిమిత్తం సెక్రటేరియట్ బ యల్దేరారు. అనంతరం ప్రజాదర్బార్ కు వివిధ సమస్యల పరిష్కారానికై వ చ్చిన ప్రతిఒక్కరి నుంచి మంత్రి సీతక్క విజ్ఞాపనలు స్వీకరించారు.

ప్రజాదర్బార్  నిర్వహణకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, డిజిపి రవిగుప్తా, జలండలి ఎండి దాన కిషోర్, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, ముషార్రాఫ్ తదితర అధికారులు ప్రజాదర్బార్ నిర్వహణను సమన్వయం చేశారు. గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్‌లకు 15 డెస్క్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి విజ్ఞాపన పత్రాన్ని ఆన్‌లైన్‌లో ఎంట్రి చేసి, ప్రతి విజ్ఞాపనకు ప్రత్యే క గ్రీవెన్స్‌నెంబర్ ఇచ్చి, ప్రింటెడ్ ఎకనాలెడ్జిమెంట్ ఇవ్వడం, పిటిషన్ దారులకు ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా ఎకనాలెడ్జిమెంట్ పంపే విధంగా ఏర్పా టు చేశారు. ప్రజాదర్బార్ లోపల ప్రజలు కూర్చోవడానికి 320 సీట్లను ఏర్పాటు చేశారు. బయట కూడా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎండ నుంచి రక్షణకై క్యూలైన్ల పైన నీడను కల్పించారు. ద్వారాల వద్ద నిలుచున్న వారికి, ప్రజాదర్బార్‌లోకి వచ్చిన ప్రజలకు తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించారు. హైదరాబాద్ నగరం నుండే కాకుండా వివిధ జిల్లాల నుంచి విజ్ఞాపనలతో వచ్చిన ప్రజలతో ప్రజాదర్బార్ కిక్కిరిసింది.
ప్రతి శుక్రవారం ‘ప్రజాదర్బార్’
ప్రజా భవన్‌లో వారానికోసారి ప్రజా దర్బార్ నిర్వహించే అవకాశముంది. ప్రతి శుక్రవారం ప్రజల కోసం ప్రజా భవన్ తెరిచే ఉంటుంది. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వారి అర్జీలను స్వీకరిస్తారని తెలుస్తోంది. మిగతా రోజుల్లో అధికారులు వాటిని స్వీకరించి పరిష్కారం సూచించే అవకాశముంటుంది. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో అందుబాటులో లేని రోజుల్లో సీఎస్, లేదా ఇతర అధికారులు ఈ కార్యక్రమాన్ని కొనసాగించే అవకాశముంది.
జనం కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ..
జనం కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ తొలి ప్రజా దర్బార్ సాగింది. జనం నుంచి ఎదిగి ఆ జనం గుండె చప్పుడు విని, వాళ్ల సేవకుడిగా సహాయం చేసే అవకాశం రావడానికి మించిన తృప్తి ఏముంటుంది.’ అని ట్విట్టర్ వేదికగా ’ప్రజాదర్బార్’ జరిగిన తీరుపై సిఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. దీంతో పాటు ప్రజాదర్బార్ లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తోన్న వీడియోను సైతం షేర్ చేశారు. తెలంగాణ మహాత్మా జ్యోతిభా పూలే ప్రజా భవన్‌కు తొలి రోజు (శుక్రవారం) ఉదయం నుంచే జనం పోటెత్తారు. ఈ క్రమంలో పోలీ సులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ’ప్రజా భవన్’లో మీకోసం గేట్లు తెరిచే ఉంటాయి. మీ అర్జీలతో రండి. నేను పరిష్కరిస్తాను’ అని సిఎం రేవంత్ రెడ్డి పిలుపుతో జనం వెల్లువలా తరలి వచ్చారు. ఆయనకు తమ సమస్యలు విన్నవించారు. ఎక్కువగా భూమికి సంబంధించిన సమస్యలే వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా ధరణి సమస్యలు సిఎం దృష్టికి పలువురు తెచ్చినట్లు సమాచా రం. కొందరు పింఛన్లు కావాలని, ఇంకొం దరు రెవెన్యూ సమస్యలను సిఎంకు విన్నవించారు. గ్యాంగ్‌స్టర్ నయీంకు సంబంధించిన ఆస్తులు ఏడికి పోయినాయి? అంటూ కొంతమంది ఈ సమస్యను సిఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. నయీం డైరీ బయటపెడితే వాస్తవాలు వెలుగు చూడగలవని వారు సిఎంకు వివరించినట్లు సమాచారం. ఇక పిల్లలు సరిగా చూడటం లేదని తమను ఆదుకోవాలంటూ కొందరు సిఎం రేవంత్‌కు అర్జీ సమర్పించారు. కొందరు తమ బిడ్డలకు స్కాలర్ షిప్‌లు రావడం లేదంటూ సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకువస్తూ వినతిపత్రం సమర్పించారు. ఓ ట్రాన్స్‌జెండర్ సైతం తన సమస్యలను చెప్పుకునేందుకు రేవంత్ ప్రజాదర్భార్‌కు వచ్చి ట్రాన్స్ జెండర్ల తరఫున తమ సమస్యలను సిఎం రేవంత్‌కు వివరించి పరిష్కరించాలని కోరారు. అయితే ప్రజా దర్బార్‌కు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు చూసుకున్నారు. వాటర్ బాటిల్స్‌ను అందజేశారు. అలాగే, నడవలేని వారు, వికలాంగుల కోసం ఓ వాహనాన్ని కేటాయించారు. ప్రజాదర్బార్ పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రజస్వామ్య పాలనకు ప్రజాదర్బారే నిదర్శనం : మల్లు రవి
తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి భారీగా ప్రజలు కదిలి వచ్చారని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. ప్రజలకు జవాబుదారిగా ఉండడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోసం జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌కు ప్రజలంతా తరలి వచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రజస్వామ్య పాలనకు ప్రజాదర్బారే నిదర్శనమని, ఇకపై ప్రతిరోజూ ఈ కార్యక్రమం కొనసాగుతుందని మల్లు రవి వెల్లడించారు. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన అనంతరం సంబంధిత శాఖలకు పంపడం జరుగుతుందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమస్యలను పరిష్కారిస్తారని తెలిపారు. ధరణి సంబంధిత దరఖాస్తులు పెద్ద మొత్తంలో వచ్చాయని వెల్లడించారు.
రేవంత్ నిర్ణయం గొప్పది, ప్రజలు హర్షిస్తారు : మోత్కుపల్లి
ప్రజానాయకులు ప్రజల్లో ఉండాలని, ప్రజలతో మమేకం కావాలని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డికి తాను మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ప్రజలను కలవాలని రేవంత్ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్పదన్నారు. ఇలాంటి నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తారని, ఇది తమ ప్రభుత్వం అని భావిస్తారని చెప్పారు. సిఎం స్వయంగా కూర్చొని సమస్యలను పరిష్కరించడం సంతోషకరమన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజలతోనే తాను ఉంటానని రేవంత్ చెప్పారని, చెప్పిన విధంగానే ఆయన ప్రజల్లోకి వచ్చారని చెప్పారు. జనాల్లో సిఎం ఉండటం కంటే గొప్ప కార్యక్రమం ఏముంటుందని ప్రశ్నించారు. మన దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని చెప్పారు. ప్రజాదర్బార్ సందర్భంగా శుక్రవారం ప్రజాభవన్‌కు మోత్కుపల్లి వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News