Tuesday, December 10, 2024

‘అమరన్’ సినిమా హాల్‌పై పెట్రోల్ బాంబులు

- Advertisement -
- Advertisement -

నటుడు శివకార్తికేయన్ నటించిన ఒక అమరసైనికుని గాథ ‘అమరన్’ చిత్రం ప్రదర్శిస్తున్న ఒక సినిమా హాలుపైకి గుర్తు తెలియని కొందరు దుండగులు శనివారం తెల్లవారు జామున పెట్రోల్ బాంబులు విసిరారని పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు చెప్పారు. వారు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, ఈ ఘటన జరిగిన తరువాత థియేటర్‌లో ప్రవేశించడానికి ప్రయత్నించిన తమ హిందు ముణ్ణని (హిందు ఫ్రంట్) కార్యకర్తల బృందాన్ని పోలీసులు నిర్బంధించి, ఆ తరువాత విడుదల చేశారని సంస్థ తెలియజేసింది. ‘మేలపాలాయంలోని సినిమా సముదాయం ప్రహరీ గోడకు ఆవల పెట్రోల్ బాంబులను ఇద్దరు దుండగులు విసిరారు. అవి పేలాయి. కానీ ఎవరూ గాయపడలేదు, వాటి వల్ల థియేటర్‌కూ ఎటువంటి నష్టమూ వాటిల్లలేదు’ అని పోలీసులు వివరించారు. ఇది ఇలా ఉండగా, తమిళనాడు బిజెపి ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News