Friday, December 1, 2023

చంద్రబాబును జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు: లోకేశ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “చంద్రబాబుకు జైల్లో ఏం జరిగినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత. జైలులో అంతం చేసేందుకే చంద్రబాబును అరెస్టు చేశారని అనుమానం ఉంది. మా అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. చంద్రబాబును రాజమండ్రి జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్ష నేతకి జైల్లో హాని తలపెట్టేలా ప్రభుత్వం కుట్ర చేస్తోంది. చంద్రబాబుకు జైల్లో భద్రత లేదు. విపరీతంగా దోమలు కుడుతున్నాయన్నా జైలు అధికారులు పట్టించుకోవట్లేదు. జైలులో రిమాండ్ ఖైదీ సత్యనారాయణ డెంగ్యూతో చనిపోయాడు. చంద్రబాబుకు ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారు” అని లోకేశ్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News