Wednesday, December 4, 2024

కెనడా పౌరులకు వీసా సేవలు నిలిపివేత: భారత్ నిర్ణయం

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో కెనడా దేశస్థులకు వీసా సేవలను భారత్ నిలిపివేసింది. ఖలిస్తానీ నాయకుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో హత్యకు గురైన దరిమిలా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.

కెనడాలో వీసా దరఖాస్తుల కేంద్రాలను నిర్వహించే బిఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ తన కెనడియన్ వెబ్‌సైట్‌లో ఈ విధంగా ఒక సందేశాన్ని పోస్టు చేసింది. ఇండియన్ మిషన్ నుంచి ఒక ముఖ్యమైన నోటీసు. నిర్వహణ కారణాల వల్ల 2023 సెప్టెంబర్ 21(గురువారం) నుంచి తదుపరి నోటీసు వరకు భారతీయ వీసా సర్వీసులు నిలివేయడమైనది.

భారత ప్రభుత్వంతో సంబంధం ఉన్న ఏజెంట్లే ఖలీస్తానీ నాయకుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ను హత్య చేసినట్లు తమ భద్రతా సంస్థల వద్ద ఆధారాలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఆరోపించిన దరమిలా ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రకటన వెలువడిన తర్వాత కెనడాలోని భారతీయ దౌత్యవేత్త ఒకరిని తమ దేశం బహిష్కరిస్తున్నట్లు కెనడా విదేశాంగ మంత్రి మెలీన్ జోలి గత సోమవారం ప్రకటించారు. దీనికి ప్రతిస్పందనగా భారత విదేశాంగ శాఖ కూడా భారత్‌లో పనిచేస్తున్న ఒక సీనియర్ కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. ఆయన ఐదు రోజుల్లోపల దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశించింది. అంతేగాక నిజ్జర్ హత్యతో తమకు ఎటువంటి సంబంధం లేదని భారత్ స్పష్టం చేసింది.

ఇలా ఉండగా..కెనడాలోని భారతీయ కాన్సులేట్‌లను మూసివేయాలని డిమాండు చేస్తూ ఖలిస్తానీ అనుకూల సంస్థ వచ్చే వారం నుంచి శాంతియుత నిరసలు చేపట్టనున్నట్లు ప్రకటిఇచింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News