Saturday, July 27, 2024

తొలి కానుక

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ /న్యూఢిల్లీ : కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రధాని నరేం ద్ర దామోదర్‌దాస్ మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. పిఎం కిసాన్ పథకం కింద 17వ వి డత రూ. 2వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ పథకం కిం ద ఉన్న రైతుల బ్యాంకు ఖాతాలకు త్వరలోనే నిధులు జమ కానున్నాయి. దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యత లు స్వీకరించిన మోడీ సోమవారం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారుల కు నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. తొలి సంతకం పిఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్‌పైనే చేశారు. దీం తో ఈ పథకం కింద మొత్తం 9.3 కోట్ల రై తులకు లబ్ధి చేకూరనుంది.రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి‘ అనే పథకాన్ని తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరి లో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చిం ది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు పంట సా యంగా ఎకరానికి ఏటా 6 వేల రూపాయ లు అందిస్తోంది.

ఈ 6 వేల రూపాయలను సంవత్సరానికి మూడు విడతలుగా నేరుగా రైతుల అకౌంట్స్‌లో జమ చేస్తూ వస్తోంది. ఏప్రిల్- జులై తొలి విడతగా, ఆగస్టు- నవంబర్ రెండో విడతగా, డిసెంబర్-మార్చి మూ డో విడతగా.. 2 వేల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిస్తోంది. కేంద్ర ప్రభు త్వం ఇప్పుటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా 16 సార్లు నిధులు విడుదల చేసిం ది. ఇప్పుడు 17వ విడత నిధులు విడుదల కావాల్సి ఉంది. మూడోసారి ప్రధానిగా బా ధ్యతలు స్వీకరించిన మోడీ..పిఎం కిసాన్ ఫైల్‌పైనే తొలి సంతకం పెట్టడంతో త్వరలోనే డబ్బులు అకౌంట్లలో జమ కానున్నా యి. కాగా ఫైల్‌పై సంతకం చేసిన అనంత రం మోడీ మాట్లాడుతూ, ‘మాది కిసాన్ సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం. అందువల్ల బాధ్యతలు స్వీకరించిన మీదట సం తకం చేసిన తొలి

ఫైల్ రైతు సంక్షేమానికి సంబంధించినది కావడం సముచితం. మున్ముందు రైతుల కోసం, వ్యవసాయ రంగం కోసం మరింతగా కృషి చేస్తూనే ఉండాలని అనుకుంటున్నాం’ అని తెలియజేశారు. రైతుల ఆగ్రహం సార్వత్రిక ఎన్నికల్లో అధికార బిజెపిని గట్టిగా దెబ్బ తీసింది. బిజెపి అభ్యర్థులను గ్రామాల్లో ప్రచారం చేయకుండా నిరోధించడం ద్వారా ఆ పార్టీ పట్ల తమ అసంతృప్తిని పంజాబ్‌లో రైతులు వ్యక్తం చేశారు. తత్ఫలితంగా బిజెపి పలు లోక్‌సభ సీట్లను కోల్పోయింది. అందుకే మోడీ తన ప్రభుత్వం ముందుకు సాగడంలో రైతులకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. తమిళనాడు, మణిపూర్‌తో పాటు పంజాబ్‌లో కూడా బిజెపి తన ఖాతా తెరవలేకపోయింది. కాగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై) కింద మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సోమవారం తన తొలి సమావేశంలో ఆమోదించింది.

మోడీ 3.0 ప్రభుత్వంలో క్యాబినెట్ తొలి సమావేశం ప్రధాని7, లోక్ కల్యాణ్ మార్గ్ నివాసలో జరిగింది. ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల మంత్రులు అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘అర్హులైన కుటుంబాల సంఖ్య పెరుగుదల వల్ల గృహవసతి అవసరాలు తీర్చేందుకు ఇళ్ల నిర్మాణం కోసం మూడు కోట్ల అదనపు గ్రామీణ, పట్టణ ప్రాంత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయాలని సోమవారం క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించడమైంది’ అని అధికారులు వెల్లడించారు. కనీస సదుపాయాలతో ఇళ్ల నిర్మాణం కోసం అర్హులైన గ్రామీణ,పట్టణ ప్రాంత కుటుంబాలకు సహాయం అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం 2015-16 నుంచి పిఎంఎవైని అమలు చేస్తున్నది. పిఎంఎవై కింద గడచిన పది సంవత్సరాలలో గృహవసతి పథకాల కింద అర్హులైన పేద కుటుంబాల కోసం మొత్తం 4.21 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News