Friday, September 20, 2024

ప్రపంచ నేతల్లో మోడీ మళ్లీ టాప్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా మరొకసారి ఆవిర్భవించారు. మోడీ ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను, కొత్తగా నియుక్తుడైన యుకె ప్రధాని కైర్ స్టార్మర్‌ను వెనుకకు నెట్టారు. ప్రపంచ అధినేతల ప్రధాన నిర్ణయాలను పరిశీలించే ప్రపంచ నిర్ణాయక మేధో సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ తాజా ర్యాంకింగ్‌లను విడుదల చేసింది.

ఆ సంస్థ సర్వే ప్రకారం, ప్రధాని మోడీ 69 శాతం ఆమోదిత ర్యాంకింగ్ తో అగ్ర స్థానంలో నిలిచారు. మెక్సికో అధ్యక్షుడు ఆంద్రీ మాన్యూల్ లోపెజ్ ఒబ్రడార్ 63 శాతం ర్యాంకింగ్‌తో ద్వి తీయ స్థానం పొందారు. ‘సర్వే చేసిన ప్రతి దేశంలో వయోజనుల నుంచి ఏడు రోజుల అభిప్రాయాల సగటును రేటింగ్‌లు ప్రతిబింబిస్తాయి’ అని ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

25 మంది నేతల జాబితాలో కట్టకడపటి స్థానంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఉన్నారు. ఆయన ఆమోదిత రేటింగ్ 16 శాతం. గత సర్వేల్లో సైతం ప్రధాని మోడీ ప్రపంచ రేటింగ్‌ల్లో అగ్ర స్థానంలో ఉండడం గమనార్హం. అదే సమయంలో ఇతర బడా ప్రపంచ నేతల ఆమోదిత రేటింగ్‌లు మధ్య స్థాయిలో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదిత రేటింగ్ 39 శాతం కాగా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో 29 శాతం, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని కైర్ స్టార్మర్ రేటింగ్ 45 శాతంగా ఉన్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రాన్ రేటింగ్ కేవలం 20 శాతం. ప్రపంచ అధినేతల ఆమోదిత రేటింగ్‌లు వివిధ దేశాల్లో రాజకీయాలు ఏవిధంగా ఉన్నాయో సూచిస్తున్నాయి.

జూలై నాటికి అత్యంత ప్రజాదరణ గల పది మంది గ్లోబల్ నేతల జాబితా
భారత ప్రధాని నరేంద్ర మోడీ (69 శాతం)
మెక్సికో అధ్యక్షుడు ఆంద్రీ మాన్యూల్ లోపెజ్ ఒబ్రడార్ (63 శాతం)
అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మైలీ (60 శాతం)
స్విట్జర్లాండ్ ఫెడరల్ కౌన్సిలర్ వయోలా ఆమ్‌హెర్డ్ (52 శాతం)
ఐర్లాండ్ నేత సైమన్ హారిస్ (47 శాతం)
యుకె ప్రధాని కైర్ స్టార్మర్ (45 శాతం)
పోలెండ్ అధినేత డొనాల్డ్ టస్క్ (45 శాతం)
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ (42 శాతం)
స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ (40 శాతం)
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (40 శాతం).

ఈ జాబితాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంటారు. 25 దేశాల్లోకి చెక్ రిపబ్లిక్ ప్రధాని పీటర్ ఫయాలా, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యియోల్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా చివరి మూడు స్థానాల్లో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News