Sunday, September 15, 2024

పశ్చిమాసియాలో టెన్షన్..టెన్షన్

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్ సిద్ధం
లోతట్టు ప్రాంతాలపై గురి
తోడుగా హెజ్‌బోల్లా, హూతి రెబెల్స్
అమెరికా యుద్ధ విమానాలు, నౌకల
మోహరింపు ఉద్రిక్తతల నేపథ్యంలో పలు
విమానాలు రద్దు భారతీయ పౌరులకు
అప్రమత్త హెచ్చరికలు
టెహ్రాన్: హమాస్ అగ్రనేత హనియాను ఇరాన్ రాజధా ని టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ సేనలు మెరుపుదాడిలో అంతమొందించడం పశ్చిమాసియాలో భీకర యుద్ధ మేఘాలకు దారితీసింది. ఇజ్రాయెల్‌పై గట్టిగానే ప్రతీకారం తీ ర్చుకుని తీరుతామని ఇటు ఇరాన్ సేనలు, హెజ్‌బోల్లా మిలిటెంట్లు హెచ్చరించారు. ఈ దాడి వెనుక పూర్తి వ్యూ హాత్మక సాయం అమెరికాదే అని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డు పేర్కొంది. ఈ క్రమంలో లెబనాన్, ఇరాన్, ఇజ్రాయెల్ కేంద్రీకృతంగా తీవ్రస్థాయి దాడులకు రంగం సిద్ధమైంది. ఈసారి దాడులు ఇజ్రాయెల్ లోతట్టు ప్రాంతా లు, జనావాసాలపై కూడా ఉంటాయని, ఇందుకు హెజ్‌బోల్లా ఇతర మిలిటెంట్లు సన్నద్ధంగా ఉన్నారని ఇరాన్ తాజాగా ప్రకటించింది.

ఇరాన్, మిత్రదేశాలు ఏ క్షణం లో అయినా ఇజ్రాయెల్ స్థావరాలపై దాడికి దిగనున్నాయనే సమాచారంతో అక్కడి సైన్యం ఐడిఎఫ్ అప్రమత్తం అయింది. ఇజ్రాయెల్‌కు వెన్నుదన్నుగా నిలిచేందుకు యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లను అమెరికా ఇప్పుడు పశ్చిమాసియాకు తరలించడం కీలక పరిణామం అయింది. ఇది ప్రధాన ప్రాంతీయ యుద్ధానికి, మరోవైపు పాక్షిక ప్రపం చ స్థాయి ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమైంది.ఇక ఫైటర్ జెట్స్, వార్‌షిప్‌లే కాకుం డా ఇజ్రాయెల్‌కు అండగా ఉండేందుకు అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ వ్యూహరచనకు దిగింది. పశ్చిమాసియాకు అదనపు క్రూయిజర్లు, డిస్ట్రాయర్లను కూడా పం పించాలని సన్నాహాలు చేస్తోంది.

ప్రధాన నగరాలకు విమానాలు రద్దు
పశ్చిమాసియా ప్రాంతంలోని ప్రధాన నగరాలకు పలు దేశాల నుంచి తక్షణం విమాన రాకపోకలను నిలిపివేసిం ది. ఈ క్రమంలోనే టెహ్రాన్‌కు భారతదేశం నుంచి ఎయిరిండియా విమానాలు నిలిచిపొయ్యాయి. ఇజ్రాయెల్ ఇతర ప్రాంతాలలోని భారతీయ పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని భారత ఎంబసీల ద్వారా ప్రకటనలు వె లువరించింది. ఇప్పటికే ఈ ప్రాంతంలోని సముద్ర జలా ల్లో ఇరాన్ నౌకలు పహారా కాస్తున్నాయి. ప్రత్యేకిం చి హైఫా పోర్టు సిటీ వద్ద యుద్ధ నౌకలు సంచరించడం వీడియోలలో వెలుగులోకి వచ్చింది. అ యితే ఇజ్రాయెల్ ఎక్కువగా వైమానిక దాడులకు సిద్ధం అవుతోంది.
హెజ్‌బొల్లా అగ్ర నేత షుక్రిని కూడా ఇజ్రాయెల్ రెండు రోజుల క్రితం చంపివేయడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనతో లెబనాన్‌లోనే ఇరాన్ మద్దతున్న హె జ్‌బొల్లా మిలిటెంట్లు అదునుచూసుకుని ఇజ్రాయెల్ లో తట్టు ప్రాంతాలకు చొరబడి దాడికి దిగుతారని ఇరాన్ భా విస్తోంది.

ఈ విధంగా ఇజ్రాయెల్‌ను అన్ని విధాలుగా దిగ్బంధించడం జరుగుతుందని ఇజ్రాయెల్ విశ్వసిస్తోంది. అయితే ఇజ్రాయెల్‌కు ఉన్న అత్యంత సుశిక్షత, అధునాతన సైనిక బలం ముందు ఇరాన్, హెజ్‌బొల్లా బలగాలు ఏ విధంగా నిలబడుతాయనేది ప్రశ్నగా మారింది. ఇప్పటివరకూ ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా బలగాల పరస్పర దా డులు కేవలం సైనిక కేంద్రాలు, సరిహద్దు ప్రాంతాలకు పరిమితం అయ్యాయి. అయితే ఇటీవలి పరిణామాలతో ఈ పరిధి దాటి దాడులు జరుగుతాయని ఇరాన్ స్పష్టం చేసింది. మరో వైపు ఇరాన్ మద్దతు ఉన్న హూతీ రెబెల్స్ తమ నేత ఇస్మాయిల్‌ను ఇజ్రాయెల్ సేనలు తుదముట్టించినందుకు నిరసనగా ఇప్పుడు అదును చూసుకుని దా డులకు దిగుతాయని ఇరాన్ పేర్కొంటోంది. ఇజ్రాయెల్ సాగిస్తూ వస్తున్న నేరాలకు ఎక్కడో ఓ చోట అంతం పలకాల్సి ఉందని హుతి రెబెల్స్ నేత అబ్దుల్ మాలిక్ టీవీ ప్రసంగంలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News