Thursday, April 25, 2024

జి7 సదస్సుకోసం జపాన్ కు ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జి7 సదస్సులో పాల్గొనడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జపాన్‌కు పయనమయ్యారు. హిరోషిమా నగరంలో జరుగుతున్న ఈ సదస్సులో భారత్ ప్రత్యేక ఆహ్వానిత దేశంగా ఉంది. భారత్ జి20కి అధ్యక్షత వహిస్తున్న తరుణంలో జి7 సదస్సులో పాల్గొనడం అర్థవంతమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ప్రయాణానికి ముందు ట్విట్టర్‌లో ఉంచిన పోస్టులో ‘ హిరోషిమాలో జరుగుతున్న జి7సదస్సుకోసం జపాన్ బయలుదేరాను.పలు అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపేందుకు ఎదురు చూస్తున్నాను’ అని పేర్కొన్నారు. అలాగే ప్రపంచస్థాయి నేతలతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటాను అని తెలిపారు. రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా ఆగ్రహానికి గురి కావడంతో 1945 ఆగస్టు 6న జరిగిన అణుదాడి కారణంగా జపాన్‌లోని హిరోషిమా నగరంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

దీని దుష్ప్రభావాలతో ఇప్పటికీ అక్కడ అనారోగ్యంతో వందలాది జీవితాలు బలవుతున్నాయి.జపాన్ ప్రధాని కిషిద సొంత ఊరు హిరోషిమా కావడం గమనార్హం. శుక్రవారంనుంచి ఆరు రోజలు పాటు ప్రధాని మోడీ విదేశీ పర్యటనలో ఉంటారు. .పాన్ పర్యటనలో భాగంగా ఆయన హిరోషిమాలో మహాత్మాగాఃధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అహింసద్వారానే శాంతిని నెలకొల్సగలమని మహాత్ముడు ప్రపంచానికి సందేశంఇచ్చారు. ఇప్పుడు అణుభూమిలో శాంతి సందేశంగా గాంధీజీ విగ్రహం కొలువుదీరనుంది.ప్రపంచ పారిశ్రామిక, పెట్టుబడిదారీ అగ్రరాజ్యాల కూటమే జి7. ఇందులో అఎమెరికాతోపాటు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ జపాన్,బ్రిటన్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి.ప్రపంచ జిడిపిలో వీటి వాటా దాదాపు 50 శాతం.

భారత్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండోనేషియా, దక్షిణ కొరియా వంటి మరికొన్ని దేశాల అధినేతలు జి7 ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తున్నారు. వీరితో పాటుగా ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ఇంధన సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి( ఐఎంఎఫ్),ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ నాయకులూ సదస్సులో పాల్గొంటారు. ఆస్ట్రేలియాలో జరగాల్సిన క్వాడ్ (ఆస్ట్రేలియా,అమెరికా,భారత్, జపాన్)సదస్సు రద్దయినందున ఆ సదస్సును జి7 సదస్సు సందర్భంగా జపాన్‌లోనే నిర్వహించాలనుకొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News