Wednesday, May 8, 2024

జ్ఞానవాపి మసీదు శివలింగం కార్బన్ డేటింగ్ సుప్రీం స్టే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ని వారణాసిలోఉన్న జ్ఞానవాపి మసీదులో బయల్పడిన శివలింగంలాంటి ఆకృతి వయసును శాస్త్రీయంగా నిర్ధారించాలని, కార్బన్ డేటింగ్ లాంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోరు ్టశుక్రవారం నిలిపి వేసింది. కాశీ విశ్వేశ్వరాలయానికి ఆనుకుని ఉన్న ఈ మసీదులో గత సంవత్సరం నిర్వహించిన వీడియోగ్రాఫిక్ సర్వేలో ‘ ఈ శివలింగం’ బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఇది ఫౌంటైన్ అని ముస్లిం పక్షం వాదిస్తోంది. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన బెంచ్ శుక్రంవారం విచారణ జరిపింది.‘ శివలింగం’ వయసును నిర్ధారించడానికి కార్బన్ డేటింగ్ నిర్వహించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పర్యవసనాలను బట్టి చూసినప్పుడు దీనిపై లోతుగా విశ్లేషణ జరపాల్సిన అవసరం ఉందని బెంచ్ పేర్కొంది.

Also Read: పుష్ప సినిమాను తలదన్నేలా కలప అక్రమ రవాణా

అందువల్ల హైకోర్టు ఆదేశాలను తదుపరి విచారణ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు బెంచ్ పేర్కొంది. ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల స్పందనలను కూడా కోరింది. యుపి ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ కార్బన్ డేటింగ్‌తో పాటుగా మరికొన్ని ఇతర శాస్త్రీయ పరీక్షలు కూడా నిర్వహించాల్సిన అవసరం ఉందా అనే విషయాన్ని తాము కూడా తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. దీనిపై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ, ‘ఈ వ్యవహారంలో జాగ్రత్తగా ముందుకు పోవలసిన అవసరం ఉంది. ఈ ఆకృతి శివలింగమా లేక ఫౌంటైనా అనే విషయాన్ని నిర్ధారించడానికి శాస్త్రీయ దర్యాప్తుకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తున్నాం’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News