- Advertisement -
పహల్గామ్ టెర్రర్ ఎటాక్ కు ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పిఓకె)లో తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. తాము కూడా సరైన సమయం చూసి భారత్ పై దాడి చేస్తామని పాక్ ప్రకటించింది. దీంతో భారత్, పాక్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలను రద్దుచేసుకున్నారు. మే 13 నుంచి 17వ తేదీ వరకు క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్‌లో ప్రధాని మోడీ పర్యటించాల్సి ఉంది. అయితే, ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ప్రస్తుతం సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొనడంతో మూడు యూరప్ దేశాల పర్యటనలు ప్రధాని రద్దు చేసుకున్నారు.
- Advertisement -