Thursday, May 2, 2024

పిఎం కిసాన్ నిధులను విడుదల చేసిన ప్రధాని

- Advertisement -
- Advertisement -
PM Modi releases 10th instalment of PM-KISAN funds
10.9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.20,900 కోట్లు జమ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎంకిసాన్)కింద దేశవ్యాప్తంగా 10.09 కోట్ల మంది రైతులకు 10వ విడత ఆర్థిక సాయంగా రూ.20,900 కోటకు పైగా నిధులను విడుదల చేశారు. పిఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతుల కుటుంబాలకు సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తుండగా ఏటా మూడు వాయిదా పద్ధతుల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ లబ్ధిదారులకు నిధులు విడుదల చేశారు.

పిఎం కిసాన్ నిధులతో పాటుగా 351వ్యవసాయ ఉత్పత్తిదారుల సంస్థలకు(ఎఫ్‌పిఓ) రూ.14 కోట్లను విడుదల చేశారు. దీనిద్వారా 1.25 లక్షల మంది రైతలుకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, వ్యవసాయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ..2022 నూతన సంవత్సరం రోజున దాదాపు 10.9 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.20,900 కోట్లను ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. రైతులకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో పిఎం కిసాన్‌ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. 9వ విడత పిఎం కిసాన్ నిధులను గత ఏడాది ఆగస్టులో విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News