Saturday, September 21, 2024

మంకీపాక్స్‌పై ప్రధాని మోడీ సమీక్ష

- Advertisement -
- Advertisement -

మంకీపాక్స్ వైరస్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం సమీక్ష జరిపారు. ఈ వైరస్‌పై గ్లోబల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో దేశంలో తీసుకోవల్సిన చర్యల గురించి ఉన్నతాధికారులతో , నిపుణులతో ఆయన చర్చించారు. ఆఫ్రికాలోని పలు దేశాలలో ఈ వైరస్ ఇప్పుడు ఎంపాక్స్‌గా నెలకొంది. పొరుగున ఉన్న పాకిస్థాన్‌లో కూడా కొన్ని కేసులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తీసుకోవల్సిన జాగ్రత్త చర్యల గురించి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆదివారం ప్రధాని మోడీ కీలక ఆదేశాల మేరకు పిఎం ముఖ్యకార్యదర్శి పికె మిశ్రా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ముందుగా వైరస్ జాడలపై సరైన పర్యవేక్షణ పెట్టాలి. ఆసుపత్రులలో స్క్రీనింగ్ పద్ధతులను బలోపేతం చేయాల్సి ఉందని నిర్ణయించారు. విమాన ప్రయాణికుల రాకపోకల నేపథ్యంలో ఎయిర్‌పోర్టుల్లో , ఇదే క్రమంలో రైల్వేస్టేషన్లలో పర్యవేక్షక ఏర్పాట్లపై సమీక్షించారు. ఇప్పటికైతే దేశంలో మంకీపాక్స్ కేసులు ఏమీ లేవు. దేశంలో ఈ వైరస్ విస్తరించే అవకాశాలు తక్కువే అని నిర్థారించారు.

అయితే తగు విధంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం మంచిదని నిర్ణయించారు. ప్రదాని మోడీ ఎప్పటికప్పుడు పరిస్థితిని తగు విధంగా పర్యవేక్షిస్తున్నారని పికె మిశ్రా తెలిపారు. ఈ వైరస్ లక్షణాలు , వ్యాప్తి క్రమం వంటి వాటిపై రాష్ట్రాల వారిగా వ్యాధుల నియంత్రణ విభాగం నుంచి తగు సూచనలు వెలువరించారు. దీనికి సంబంధించి మెడికల్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో రాష్ట్రాల నుంచి మొత్తం మీద 200 మంది వరకూ ప్రతినిధులుగా పాల్గొన్నారని వెల్లడైంది. 2022లో మంకీపాక్స్ తలెత్తిన నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా చూస్తే 99,176 మంకీ పాక్స్ కేసులు నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వైరస్‌తో మృతుల సంఖ్య 200 మందికి పైగా చనిపోయారు. ఆఫ్రికా దేశాలలోనే ఎక్కువ మరణాలు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయాలలో రాకపోకల దశలో సరైన టెస్టులు నిర్వహించడం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News