Sunday, September 15, 2024

ఈ నెల 10న వయనాడ్‌కు ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

వయనాడ్‌లోని కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 10న సందర్శిస్తారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం తెలిపారు. బాధితుల పునరావాసం కోసం కేంద్ర సహాయాన్ని సమకూర్చే విషయంలో ప్రధాని మోడీ సానుకూల వైఖరి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. వయనాడ్ దుర్ఘటనను జాతీయ విపత్తుగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తున్న విషయాన్ని విలేకరుల సమావేశంలో విజయన్ ప్రస్తావించారు. శనివారం జరగనున్న ప్రధాని పర్యటనలో సానుకూల పర్యటన రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను పురస్కరించుకుని వయనాడ్ దుర్ఘటన తీవ్రతను అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు కేంద్ర హోం శాఖ 9 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి సమగ్ర పునరావాస ప్యాకేజీ రావచ్చని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి సహకారం, సహాయం అందుతున్నాయని ఆయన చెప్పారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో లభించిన శరీర భాగాలు, గుర్తు తెలియని మృతదేహాలకు డిఎన్‌ఎ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే మృతుల సంఖ్యపై కచ్ఛితమైన సమచారం లభించగలదని ఒక ప్రశ్నకు జవాబుగా ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News